Subscribe for notification

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో బ్లాస్టింగ్ న్యూస్..! ఆ ముగ్గురు పార్టీని వీడతారా..!?

Share

Nellore YSRCP: ఏపి వైసీపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వాటిలో కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలు సైతం వైసీపీ గాలిలో పరాజయం పాలైయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు అంటే వైసీపీ ఫ్యాన్ హవా ఉందని అనుకున్నా గత ఏడాది జరిగిన నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఒక్కటంటే ఒక్క వార్డు కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ జిల్లా మొత్తం స్వీప్ చేయగా, 2021లో జరిగిన నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లోనూ మొత్తం వైసీపీ స్వీప్ చేసింది. ఈ ఫలితాలను బట్టి చూస్తే నెల్లూరు జిల్లాలో వైసీపీ చాలా బలంగా ఉంది అనేది అర్ధం అవుతుంది.

Nellore YSRCP internal politics

 

Nellore YSRCP: గెలుపు సాధ్యం కాదని తెలిసినా.. బీజేపీ

ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం కారణంగా ఈ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీ అభ్యర్ధిగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన పార్టీలు గత సంప్రదాయాలను అనుసరించి పోటీకి దూరంగా ఉండగా, బీజేపిీ మాత్రం అభ్యర్ధిని పోటికి దింపింది. ఇక్కడ పరిస్థితులను చూస్తే వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు నల్లేరుపై నడకే అని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట, దానికి తోటు సానుభూతి కలిసి వచ్చి భారీ మెజార్టీ వస్తుందని ఆ పార్టీ భావిస్తొంది. గెలుపు సాధ్యం కాదని తెలిసినా బీజేపీ పోటీ చేస్తొంది. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి చేయి కాల్చుకుంది. ఇప్పుడు మరో సారి సిద్దపడుతోంది బీజేపీ. బీజేపీకి ఇది ఒక సరదా.

ముగ్గురు ఎమ్మెల్యేలపై నిఘా..?

ఇక జిల్లా వైసీపీ రాజకీయ వ్యవహరం చూసుకున్నట్లయితే ఈ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలపై ఆ పార్టీ నిఘా పెట్టినట్లు వార్తలు వినబడుతున్నాయి. పార్టీలో కీలకమైన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలో కొనసాగుతారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారనే అనుమానాలు షికారు చేస్తున్నాయి. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హజరుకాలేదు. దీనికి తోడు వారం రోజుల క్రితం టీడీపీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు సంచలన ట్వీట్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్ లో ఉన్నారని కాలువ కామెంట్స్ చేశారు. కాలువ శ్రీనివాసులు ఆ ట్వీట్ ను రాజకీయంగా చేసినట్లుగా భావిస్తున్నా.. నెల్లూరు వైసీపీలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనీ, గ్రూపు విభేదాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. నాయకులు పరస్పరం బహిరంగ విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాలవ శ్రీనివాసులు ట్వీట్ చేసిన నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం ఆ నేతలపై నిఘా పెట్టినట్లు తెలుస్తొంది. వాళ్లు ఏయే నియోజకవర్గాలపై కట్చీఫ్ వేశారో ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ చార్జిలను ప్రకటించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వారు పార్టీ మారే అవకాశాలు ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో అధిష్టానం రాజీ చర్చలు నిర్వహిస్తే వాళ్ల మధ్య మనస్పర్ధలు తొలగిపోయే అవకాశం లేకపోలేదు.

Nellore YSRCP: ఈ స్థానాల్లో వైసీపీకి తిరుగులేదు

ఇక నెల్లూరు టౌన్ లో మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తే ఆయనకు సానుభూతి వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీని వల్ల తాజా మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. నెల్లూరు రూరల్ లో మాత్రం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి డౌట్ లేదని అంటున్నారు. కొవ్వూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరిస్థితి కూడా నియోజకవర్గంలో బాగానే ఉంది. సూళ్లూరుపేటలో వైసీపీకి తిరుగులేదు. మిగిలిన నియోజకవర్గాల్లో అంతర్గత గొడవలు ఉన్నాయి. గూడూరు వైసీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. కావలిలో బీదా రవిచంద్రకు టీడీపీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్నాయి. ఉదయగిరి, వెంగటగిరి నియోజకవర్గాల్లో టీడీపీ బలపడుతున్నట్లు ఆ పార్టీ భావిస్తోంది.

 

Nellore YSRCP: మూడు నియోజకవర్గాల్లో టీడీపీ ఆశలు

ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నా, రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఆనం రామనారాయణరెడ్డి కుమార్తెను రంగంలోకి దింపితే ఫైట్ టఫ్ అవుతుందని అంటున్నారు. నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికలకు మాదిరిగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసే పరిస్థితి ఉండదని, ముడు నాలుగు స్థానాల్లో టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని, గెలుపు అవకాశాలు కూడా ఉంటాయని భావిస్తున్నారు. వైసీపీ మాత్రం మళ్లీ జిల్లాలో స్వీప్ చేస్తామని చెబుతున్నా టీడీపీ మాత్రం మూడు స్థానాల్లో హోప్స్ పెట్టుకుంది. వాస్తవానికి కడప జిల్లా తరువాత నెల్లూరు జిల్లానే వైసీపీ కంచుకోట లాంటింది. చూడాలి రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో!

 


Share
Special Bureau

Recent Posts

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

33 mins ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

1 hour ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

1 hour ago

Radhika Apte Balakrishna: రాధిక ఆప్టే కంప్లైంట్ చేసింది బాలయ్య మీదేనా..??

Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…

2 hours ago

YCP Plenary: వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తారా..? రారా..?.. సజ్జల ఇచ్చిన క్లారిటీ ఇది..!!

YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…

2 hours ago

Suriya: సంచలనం ఆస్కార్ కమిటీలో… హీరో సూర్యకి స్థానం..!!

Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన…

3 hours ago