Oxymeter: షాక్ః ఆక్సిమీట‌ర్ వాడితే బ్యాంకులో డ‌బ్బులు క‌ట్‌

Share

Oxymeter: మోస‌గాళ్ల‌కు స‌మ‌యం, సంద‌ర్భం, మ‌న బాధ – భ‌యంతో సంబంధం ఏముంటుంది చెప్పండి? వాళ్ల‌కు కావాల్సింది మోసం చేయ‌డం… డ‌బ్బులు దొబ్బ‌డం. అలాగే తాజాగా క‌రోనా క‌ల‌క‌లం స‌మ‌యంలో జ‌రుగుతున్న ఓ సంచ‌ల‌న మోసం వెలుగులోకి వ‌చ్చింది. క‌రోనా క‌ల‌క‌లం స‌మ‌యంలో సైబర్‌ నేరగాళ్లు తమకు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అమాయకులను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆక్సిమీటర్ల ద్వారా వల విసురుతున్నారు.

Read More: Corona: క‌రోనా టైంలో ఒక్కొక్క‌రుగా మోడీని భ‌లే బుక్ చేస్తున్నారుగా

 

ఇలా మోసం చేస్తున్నారు…

ఇటీవ‌ల ఆక్సిమీటర్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రు సైబ‌ర్ మోస‌గాళ్లు దీన్ని ఉప‌యోగించుకొని ఈ ఆక్సిమీటర్లలో వారు ఒక కార్డ్‌ రీడర్‌ను అమరుస్తున్నారు. ఆక్సిమీటర్‌ తమవద్ద ఉన్న సమయంలో వినియోగదారులు కచ్చితంగా దానిలో తమ వేలుపెట్టి ఆక్సిజన్‌ స్థాయిని పరీక్షించుకుంటారు. ఆ సమయంలోనే వీరి వేలిముద్రలు అందులోని కార్డ్‌రీడర్లోకి వెళ్లిపోతాయి. దీంతో ఈ మోసానికి తెర‌తీస్తున్నారు.

Read More: Corona: క‌రోనా టైంలో ఒక్కొక్క‌రుగా మోడీని భ‌లే బుక్ చేస్తున్నారుగా

మోసం ఇలా ప్రారంభం …
సైబ‌ర్ నేర‌గాళ్లు విక్రయించే ఆక్సిమీటర్‌ 15 రోజులే పనిచేస్తుంది. దానిని అమ్మే సమయంలోనే… ‘ఏదైనా సమస్య వస్తే ఆక్సిమీటర్‌ను రీప్లేస్‌ చేస్తాం’ అని వారు హామీ ఇస్తారు. ధర ఎక్కువపెట్టి కొనుగోలు చేసిన వినియోగదారుడు అది చెడిపోగానే తిరిగి వీరినే సంప్రదించాల్సి వస్తుంది. ఆక్సిమీటర్‌ చెడిపోయిందని ఫోన్‌ చేయగానే వాళ్లు వచ్చి పాతది తీసుకొని కొత్తవి ఇస్తారు. వెనక్కి తీసుకున్న ఆక్సిమీటర్‌లోని కార్డ్‌రీడర్లను వెలికితీసి వాటిలోని మన వేలిముద్రలను సేకరిస్తారు. ఆ తర్వాత డార్క్‌నెట్‌ లేదా ఇతర వ్యక్తుల ద్వారా సిమ్‌ కార్డు డాటాను తీసుకుంటారు. ఆ డాటాలో మన వేలు ముద్రలను బట్టి మన ఫోన్‌నంబర్లను సేకరిస్తారు. లేదా మన ఆధార్‌ సమాచారం తీసుకుంటారు. వీటి ద్వారా వారికి మన బ్యాంక్‌ ఖాతాల వివరాలు తెలిసిపోతాయి. అలా వారు బ్యాంక్‌ ఖాతాలను జల్లెడ పట్టి వాటి ద్వారా మన డబ్బును దోచేందుకు కుట్రలు పన్నుతుంటారు. ఇలా ఆన్‌లైన్‌లో ఆక్సిమీటర్లు కొనుగోలుచేసిన వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిన కేసులు ఇటీవల భారీగా నమోదవుతున్నాయి. అందుకే మీరు బీ కేర్ ఫుల్‌?


Share

Related posts

Municipal Elections : నామినేషన్‌ల దాఖలుకు ఎస్ఈసీ అవకాశం ఇచ్చినా…పోటీకి దూరంగా తెలుగు తమ్ముళ్లు

somaraju sharma

హీరోయిన్ గా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ పుష్ప లో ఐటెం సాంగ్ ఎలా చేస్తుందనుకున్నారు ..?

GRK

‘ఎల్ఆర్ఎస్’పై కాస్త వెనక్కుతగ్గిన కేసిఆర్..కీలక ఆదేశాలు జారీ..!!

somaraju sharma