YS Jagan : జ‌గ‌న్ కు దొరికిపోయిన బీజేపీ… ఇక గేమ్ షురూ

Share

YS Jagan : ఏపీ ముఖ్య‌మంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీని టార్గెట్ చేస్తూ ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ టార్గెట్‌లో భాగంగా బీజేపీ నేత‌లు త‌మ ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టేశారు. ఈ క్ర‌మంలో ఇరు పార్టీల ఎత్తులు పై ఎత్తులు సాగుతున్నాయి.

అయితే తాజాగా బీజేపీ చేసిన ఓ వ్యాఖ్య వైసీపీకి ఆ పార్టీని ఇరుకున పెట్టే చాన్స్ ఇచ్చిందంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్ర‌చారం బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జీ సునీల్ థియోధర్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ బెయిల్‌పై ఉన్నారని.. త్వరలోనే ఆయన బెయిల్ రద్దు అయిపోతుందంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అయితే, దీని ఆధారంగా వైసీపీ ఓ రేంజ్‌లో ఎదురుదాడి చేసింది.

new-game-by-YS Jagan-on-bjp
new-game-by-YS Jagan-on-bjp

YS Jagan జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అవుతుందా?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో పొలిటికల్ హీట్ పెంచేలా సునీల్ థియోథ‌ర్ మాట్లాడుతూ ప్రస్తుతం బెయిల్ పై ఉన్న జగన్ ఏ క్షణమైనా జైలుకెళ్లొచ్చు జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. అయితే, బీజేపీ ముఖ్య నేత చేసిన చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ జ‌గ‌న్ న‌మ్మిన‌బంటు సీఎం వైఎస్ బెయిల్ రద్దు అవుతుందని బీజేపీ నేతలు ముందే ఎలా చెప్తారు..? అంటూ నిల‌దీశారు. న్యాయ వ్యవస్థ బీజేపీ చేతుల్లో ఉంటుందా..? అని ప్రశ్నించారు. బీజేపీ కేంద్రంలో ఉందని ఏది మాట్లాడిన ప్రజలు వింటారని అనుకుంటున్నారా..? అంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు వ్యవస్థలపై చేస్తున్న వ్యాఖ్యలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నారూ అని ఫైర్ అయ్యారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూలిపోతుందా?

వ్యవస్థలోని కొందరు వ్యక్తులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు అని సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు. చంద్రబాబు వెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నారని విమర్శించిన ఆయన.. టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లిన వారితో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, బీజేపీ నేత చేసిన కామెంట్ల ఆధారంగా ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారుపై ఏదో జ‌రుగుతోంద‌నే కామెంట్లు ప్ర‌జ‌ల్లో నాటుకునేలా సీన్ మారిపోయింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


Share

Related posts

యుూకేకి విమాన సర్వీసులపై కేంద్రం కీలక ప్రకటన

somaraju sharma

చిదంబరం అరెస్టు తప్పదా!?

Siva Prasad

ఒక్క సారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై 100 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు..!

Srikanth A