NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ప్రతిదానికి ఫైన్ అంటే ఎలా జగన్ ?? కొత్త జీవోపై విపరీత ట్రోలింగ్స్

వింత సమస్యలు.. దానికి మరి వింత పరిస్కారాలు ఆంధ్రాలో మాములు అయిపోయాయి… నగరాల్లో గ్రామాల్లో ఎక్కువగా ఉన్న వీధి కుక్కలా పెంపకం విషయంలో జగన్ సర్కారు తీసుకున్న కొత్త నిర్ణయం సోషల్ మీడియా లో పెద్ద ట్రోలింగ్స్ కు దారి తీస్తోంది… ప్రతిదానికి ఫైన్ వేస్తే సరిపోతుందా..? డబ్బులు కట్టేసి ఎలాంటి తప్పు చేసిన ఒప్పు అవుతుందా అని పలువులు ప్రశ్నిస్తున్నారు… ప్రభుత్వ విధానం సారి అయినదే అవ్వొచ్చు కానీ… ప్రతి అంశానికి డబ్బుతో ముడి పెట్టి ఉత్తర్వులు ఇవ్వడం వాళ్ళ ప్రభుత్వానికి తటస్థుల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది.. ఇది ప్రభుత్వానికి తర్వాతతర్వాత దెబ్బ తీసే ప్రమాదం లేకపోలేదు..

ఏమిటా వింత ఉత్తర్వులు అంటే..

** ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో ఇకపై కుక్కలు, పందులకు లైనెస్న్ తప్పనిసరి అని.. వాటిని పెంచుకోవాలి అనుకుంటున్నా వారు కచ్చితంగా డబ్బు చెల్లించి అనుమతి తీసుకోవాలన్నది ప్రభుత్వ భావన.. ఇది ఎందుకు అంటే గ్రామాల్లో.. పట్టణాల్లో ఇబ్బంది పెడుతున్న కుక్కలను నిర్ములించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.. దీనిలో భాగంగా కుక్కలను పెంచుకోవాలని అంటే… కచ్చితంగా ఆయా సచివాలయాల్లోని అధికారితో అనుమతి తీసుకునేలా.. రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జీ.వో నంబరు 693 జారీ చేసింది. ఇకపై లైసెన్స్ లేని కుక్కలు పందులను అధికారులు పట్టుకుంటే రూ.500 జరిమానాతో పాటు రోజుకి రూ.250 అపరాధ రుసుము చెల్లించాలని జీవోలో పేర్కొంది.
** ఆధికారులు తనిఖాలకు వచ్చినప్పుడు పందులు, కుక్కలకు సంబంధించిన లైసెన్స్ లను వాటిని పెంచుకున్న వారు తప్పనిసరిగా చూపించాలని అలా చూపించకుంటే వాటిని పంచాయతీ సిబ్బంది తీస్కువెళ్తారని పేర్కొంది.
** ఒకవేళ వాటి యజమానులుగా నిర్ధారణ కాకపోతే వాటిని వీధికుక్కలుగా పరిగణించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని పేర్కొంది. అలాగే కుక్కలు, పందుల లైసెన్స్ ముగిసిన ౧౦ రోజుల్లోగా రెన్యువల్ చేసుకవాలని సూచించింది. పెంపుడు జంతువులకు యజమానులు ఖచ్చితంగా హెల్త్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. కుక్కలకు హెల్త్ సర్టిఫికెట్, పందులకు ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని అదేశించింది.

ఇది కూడా డబ్బుతోనే !!

పందుల పెంపకం దారులను గ్రామాల బయటకు వెళ్లగొట్టడం వరకు ఓకే… కానీ పెంపుడు కుక్కలకు లైసెన్స్ తీసుకునే విధానం ఏక్కడ లేదు. పోనీ కుక్కలను పెంచుకున్న వారికీ ఉచితంగా ఈ లైసెన్స్ ఇస్తారా అంటే అది కాదు.. అంత డబ్బుతోనే.. దీనిపైనే ఇప్పుడు అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత.. సోషల్ మీడియా నుంచి విపరీత ట్రోలింగ్స్ మొదలు అయ్యాయి.
** ఇక ప్రతి గ్రామ పంచాయతీలో కుక్కలు, పందుల యజమానులకు టోకెన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన టోకెన్లను పెంపుడు జంతువుల మెడ చుట్టూ నిరంతరం వేలాడేలా ఉంచాలని పేర్కొంది. అంతేకాదు గ్రామాల్లో పెంపుడు కుక్కలు, పందులు, వీధి కుక్కలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీకి గ్రామ సర్పంచ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. అలాగే పంచాయతీ సెక్రటరీ కన్వీనర్ గా ఉంటారు. మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మెడికల్ ఆఫీసర్, మండల పశుసంవర్ధక శాఖ అధికారి, గ్రామ పశుసంవర్ధక శాఖ సహాయకుడు, జిల్లా SPCA నామినేట్ చేసిన సభ్యులు, జంతు సంరక్షణ సంస్థల నుంచి ఇద్దరు వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ మొత్తం విధి విధానాలని ఈ జీవో లో ఉన్నాయి.

ఈ కమిటీ గ్రామ పంచాయతీల్లో పెంపుడు కుక్కలు, పందుల సంఖ్య, వాటి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. అలాగే విధికుక్కలు, యజమానులు లేని పందులు, కుక్కలను గుర్తించి వాటిని పట్టుకోవడం, వెటర్నరీ ఆస్పత్రులకు తరలించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం, టీకాలు వేయించడం వంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. అలాగే పెంపుడు జంతువులపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంటుంది. గ్రామాల్లో సంచరించే పందులపై గ్రామపంచాయతీ నిత్యం దృష్టి పెడుతూ వాటిని శివారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలకు తరలించాలని సూచించింది.

author avatar
Comrade CHE

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju