28.2 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కోడి కత్తి కేసు .. ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు

Share

విజయవాడ ఎన్ఐఏ కోర్టు నందు కోడి కత్తి కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో విచారణకు హజరుకావాలని ఏపి సీఎం జగన్మోహనరెడ్డికి ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10న విచారణకు కేసులో బాధితుడు, సీఎం జగన్ హజరు కావాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టు స్పష్టం చేసింది. సీఎంతో పాటు పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హజరుకావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణలో భాగంగా విజయవాడ ఎన్ఐఏ కోర్టు మంగళవారం విజయవాడ ఎయిర్ పోర్టు అథారిటీ కమాండర్ దినేష్ ను విచారించింది. కేసుకు సంబంధించి ఘటనా స్థలంలో సీజ్ చేసిన కోడి కత్తి, మరో చిన్న కత్తి, నిందితుడి పర్సు, సెల్ ఫోన్ ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.

NIA Court Key Orders

 

గత వారంలో ఇదే కేసుపై పిర్యాదుదారుడైన ప్రత్యక్ష సాక్షి సీఐఎస్ఎఫ్ కమాండెంట్ దినేష్ కుమార్ ను ఎన్ఐఏ కోర్టు విచారించింది. దినేష్ కుమార్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా న్యాయమూర్తి విచారించారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడి నుండి ఏమేమి స్వాధీనం చేసుకున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా, కోడికత్తి తో పాటు పర్సు, బెల్టు వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వాటిని చూపించమని న్యాయమూర్తి అడగగా వాటిని తీసుకురాలేదని తెలిపారు. సాక్షులను విచారిస్తున్నప్పుడు వాటిని కోర్టుకు తీసుకురావాల్సిన బాద్యత ఐవోపై లేదా అని ప్రశ్నించారు. తదుపరి విచారణ నాటికి సీజ్ చేసిన వస్తువులను కోర్టుకు చూపించాలని ఆదేశించడంతో నేటి విచారణ సమయంలో వాటిని కోర్టుకు చూపించారు.

ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎన్నిరోజులంటే..?


Share

Related posts

బ్రేకింగ్ : విశాఖలో మరో ఘోర ప్రమాదం…! ఫార్మాసిటీలో భారీ పేలుడు…. మంటల్లో చిక్కుకున్న జనం?

arun kanna

భారత్ -పాక్ నూక్లియర్ కేంద్రాల వివరాల మార్పిడి

Siva Prasad

Panjab Congress: కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర సీనియర్ నేత గుడ్ బై..

somaraju sharma