NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ

Nimmagadda : వైసీపీ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చే ప్రయత్నంలో నిమ్మగడ్డ..? జగన్ అడ్డుకుంటారా?

Peddireddy - Nimmagadda: పెద్దిరెడ్డి టూ నిమ్మగడ్డ! ఇదో స్ట్రాటాజీ

Nimmagadda : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదమే నడిచింది. చివరకు సుప్రీం కోర్టులో ఎస్ఈసీ అనుకూలంగా తీర్పు రావడంతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఒక పక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వం, ఎస్ఈసీ మద్య ఉప్పు – నిప్పు లాంటి పరిస్థితే కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ఎన్నికల సంఘం సమన్వయంతో వ్యవహరించాలని కోర్టులు సూచించినా ఇక్కడ సమన్వయ పరిస్థితులు కనబడటం లేదు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలతో ప్రభుత్వానికి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.

Nimmagadda : Nimmagadda in an attempt to give another shock to the YCP government ..? Interrupt jagan?
Nimmagadda Nimmagadda in an attempt to give another shock to the YCP government Interrupt jagan

Jagan : నిమ్మగడ్డ ఉత్తర్వులకు తూట్లు

ఈ నేపథ్యంలో జగన్మోహనరెడ్డి సర్కార్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తూ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధపడి ఏర్పాట్లు చేసినా నిమ్మగడ్డ ఇస్తున్న ఆదేశాలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విచక్షణాధికారాల పేరుతో నిమ్మగడ్డ తనకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటే పోతే తాము చూస్తూ ఊరుకోమని అంటున్నది ప్రభుత్వం. ఈ క్రమంలోనే పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ లపై అభిశంసన ఉత్తర్వులను నిమ్మగడ్డ జారీ చేస్తే ప్రభుత్వం తిప్పి పంపింది. ఇదే విషయంపై డీఓపిటికి ప్రభుత్వం లేఖ రాసింది. ఆ తరువాత ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఐఎఎస్ అధికారి రవిచంద్ర ను నియమించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రభుత్వానికి లేఖ రాస్తే ఆ లేఖను ప్రభుత్వం పట్టించుకోకుండా రవిచంద్ర కోసం వైద్యఆరోగ్య శాఖలో ప్రత్యేకంగా కార్యదర్శి పోస్టును సృష్టించి ఆయనకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ బాధ్యతలను అప్పగించింది. ఆ తరువాత సీఎంఓల కీలక అధికారి ప్రవీణ్ ప్రకాష్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాశారు. దీనిపైనా ప్రభుత్వం స్పందించలేదు. ఎస్ఈసీ చర్యలపై ప్రవీణ్ ప్రకాష్ వివరణ ఇచ్చారు. తాను ఏతప్పు చేయలేని స్పష్టం చేశారు. చివరకు ఎస్ఈీసి నిమ్మగడ్డ తన ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా మరో లేఖ ప్రభుత్వానికి రాశారు. ఇలా నిమ్మగడ్డ ప్రభుత్వానికి లేఖలు రాయడం వాటిని ప్రభుత్వం లైట్ గా తీసుకోవడం తెలిసిందే. అయితే ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎపిసోడ్ లో కోర్టుకు వెళ్లిన ప్రతి సారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ కు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ ప్రభుత్వానికి మరో రెండు షాక్ లు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.

Nimmagadda : Nimmagadda in an attempt to give another shock to the YCP government ..? Interrupt jagan?
Nimmagadda Nimmagadda in an attempt to give another shock to the YCP government Interrupt jagan

Nimmagadda : నిమ్మగడ్డ పదవీ కాలం పొడిగింపు సాధ్యమేనా?

పంచాయతీ ఎన్నికలు వద్దు మొర్రో అని వైసీపీ అంటుంటే పంచాయతీ ఎన్నికలు పెట్టేస్తున్నారు. ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే వరుసగా మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్ పీ టీ సీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో నిమ్మగడ్డ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 21వ తేదీ పంచాయతీ చివరి విడత ఎన్నికలు పూర్తి అయిన వెంటనే మరుసటి రోజు 22 వ తేదీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ప్రభుత్వానికి మరో షాక్ యే. అయితే నిమ్మగడ్డ పదవీ కాలం మార్చి 31వ తేదీ వరకే ఉంది. ఈ లోపుగా మొత్తం అన్ని ఎన్నికలు పూర్తి చేయాలంటే సాధ్యపడదు. ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వం నిమ్మగడ్డను అర్ధాంతరంగా ఆ పదవి నుండి తొలగించి కనగరాజ్ ను నియమించిన సమయంలో రెండు నెలల పదవీ కాలం కోల్పోయారు. ఆ సమయంలో హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించి తిరిగి ఎస్ఈసీ కుర్చీలో కూర్చున్నారు నిమ్మగడ్డ. నిమ్మగడ్డ కోల్పోయిన ఆ రెండు నెలల కాలాన్ని పొడిగించాలని గవర్నర్ ను కోరే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ గవర్నర్ నిమ్మగడ్డ పదవీ కాలాన్ని మరో రెండు నెలలు పొడిగించేందుకు అనుమతి ఇవ్వకపోతే మళ్లీ హైకోర్టు కు వెళ్లి మరీ సాధించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇది గనుక జరిగితే జగన్ సర్కార్ కు మరో షాకింగ్ న్యూస్ యే అవుతుంది. ఈ చర్యలను నిలువరించేందుకు జగన్మోహనరెడ్డి సర్కార్ ఏమి చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju