NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda : ఇన్నాల్లో జగన్ మౌనంగా – రియాక్ట్ అవ్వకుండా ఉంది దీనికోసమే ? ఇప్పటికి నిమ్మగడ్డ కరక్ట్ పాయింట్ లో దొరికాడు?

Nimmagadda : ఏపిలో స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం, ఎస్ఈసీ Ramesh Kumar మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మౌనం వహిస్తూ వచ్చారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాడానికి ఎస్ఈసీ, ఎస్ఈసీని ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తూనే ఉన్నాయి. వివాదం అయిన ప్రతి సారి ప్రభుత్వంపై ఎస్ఈసీ, ఎస్ఈసీ పై ప్రభుత్వం కోర్టు గడప తొక్కుతూనే ఉన్నాయి.

Nimmagadda : Nimmagadda Ramesh Kumar is entangled with the government
Nimmagadda Nimmagadda Ramesh Kumar is entangled with the government

ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు ప్రభుత్వానికి చిక్కినట్లు అయ్యింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎన్నికలకు పురస్కరించుకుని ఈ వాచ్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇక నిమ్మగడ్డ దొరికినట్లే అనుకున్న ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 9వ తేదీ వరకూ యాప్ ను ఉపయోగించవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ లోపుగా భద్రతా పరమైన అనుమతి పత్రాలు సమర్పించాలని ఆదేశించింది.

Nimmagadda : Nimmagadda Ramesh Kumar is entangled with the government
Nimmagadda Nimmagadda Ramesh Kumar is entangled with the government

అవిష్కరణ తరువాత అనుమతికి ధరఖాస్తు

ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకువచ్చిన యాప్ ప్రైవేటు వ్యక్తులు తయారు చేశారనీ, దీని వెనుక టీడీపీ హస్తం ఉందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ప్రభుత్వ ఆమోదం కూడా పొందలేదని చెబుతోంది. ఏదైనా యాప్ తీసుకురావాలంటే ప్రభుత్వం నుండి అయిదు రకాల అనుమతులు పొందాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవేమీ పట్టించుకోకుండా అత్యంత గోప్యంగా ఈ విషయాన్ని ఉంచి యాప్ తీసుకువచ్చారనేది వైసీపీ నేతల ఆరోపణ. హైకోర్టు ఆదేశాల తరువాత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ అనుమతి కోసం ధరఖాస్తు చేశారు.

అయితే ఈ యాప్ సర్పర్ కూడా ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తుండటాన్ని ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోంది. కేంద్ర ఎన్నికల సంఘంకు సంబంధించిన సీ విజిల్ యాప్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నిఘా యాప్ లు ఉండగా వీటిని ఉపయోగించకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రత్యేకంగా యాప్ తయారు చేయించడంపై ప్రభుత్వం అనుమాలు వ్యక్తం చేస్తున్నది. ఈ తరుణంలో జగన్ సర్కార్ ఎస్ఈసీ ధరఖాస్తుపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం కష్టమేనంటున్నారు. ఈ నెల 9వ తేదీలోగా ఎస్ఈసీ భద్రతాపరమైన సర్టిఫికెట్ల ను కోర్టులో సమర్పించలేకపోతే ఈ వాచ్ యాప్ కు బ్రేక్ ఉపయోగించకుండా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju