NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Nimmagadda : ఇద్ది కదరా అసలు సిసలు ట్విస్ట్ అంటే – వై ఎస్ జగన్ కి నిమ్మగడ్డ అద్భుత సపోర్ట్ ?

Nimmagadda : ఏపి AP లో పంచాయతీ ఎన్నికల Local body elections సమరం రసవత్తరంగా కొనసాగుతోంది. ఒక పక్క అధికార విపక్షాల మద్య మాటల తూటాలు పేలుతుండగా మరో పక్క ప్రభుత్వం, ఎస్ఈసీకి మద్య వైరం కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని Govt ఇబ్బంది పెట్టాలని ఎస్ఈసీ SEC,  ఎస్ఈసీని ఇరుకున పెట్టాలని ప్రభుత్వం ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఇప్పటి వరకూ చూశాం. ప్రభుత్వంపై ఎస్ఈసీ, ఎస్ఈసీపై ప్రభుత్వం కోర్టులకు వెళ్లడం సాధారణ అంశంగా మారిపోయింది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం TDP పార్టీకి, చంద్రబాబు Chandra babu కు అనుకూలమని ఆయన చెప్పినట్లు ఆడుతున్నాడు అంటూ వైసీపీ YCP నేతలు విమర్శలు చేస్తుండగా నిమ్మగడ్డ మాత్రం టీడీపీ ఏమీ సపోర్టుగా లేరనీ, వైసీపీకే సపోర్టుగానే ఉంటున్నారనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. వారి వాదనలు బలం చేకూర్చేలా ఉదాహారణలు చూపుతున్నారు.

Nimmagadda :  AP sec nimmagadda twist in election cases
Nimmagadda AP sec nimmagadda twist in election cases

వేగంగా అచ్చెన్నాయుడు అరెస్టు

సాధారణంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పోలీస్ వ్యవస్థతో అన్ని శాఖలు ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటిస్తుంటాయి. ఎన్నికలకు సంబంధించిన ఘర్షణలు, కేసుల నమోదు, అరెస్టుల విషయం ఎన్నికల సంఘానికి తెలియజేస్తుంటాయి. అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తరువాత తొలి అరెస్టు శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. అది కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడుని పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో నిమ్మాడలోని ఆయన ఇంటికి వెళ్లి అరెస్టు అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడుపై నమోదు అయిన కేసు ఎన్నికలకు సంబంధించినదే. నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ వైసీపీ మద్దతు దారుడిని బెదిరించారన్న ఆరోపణతో అచ్చెన్నాయుడుతో సహా 22 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన తరువాత ఆ పార్టీ నాయకులు సదరు అభ్యర్థితో అచ్చెన్నాయుడు ఫోన్ లో మాట్లాడిన సంభాషణ వీడియోను మీడియాకు విడుదల చేశారు. అయితే ఆయన మాట్లాడిన దానిలో బంధువర్గంలోని వ్యక్తితో మాట్లాడినట్లుగానే ఉంది గానీ ఎక్కడా బెదిరించినట్లుగా లేదు. కానీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టుకు హజరుపర్చారు. మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.

వైసీపీ నేతలపై చర్యలు ఏవి ?

అయితే ఈ కేసు విషయంలో వేగంగా స్పందించి అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన పోలీసు యంత్రాంగం వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యర్థులకు ఫోన్ చేసి బెదిరించినట్లుగా నమోదు అయిన కేసులపై ఈ స్పీడ్ చూపించలేదు అంటున్నారు. ఓ వైసీపీ ఎమ్మెల్యే ఒక వార్డు అభ్యర్థి అల్లుడికి ఫోన్ చేసి నామినేషన్ ఉపసంహరించుకోకపోతే ఇబ్బందులు పడతారు అంటూ హెచ్చరికలు జారీ చేయడం, ఆ ఫోన్ కాల్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా పోలీసులు అంత వేగంగా స్పందించిన దాఖలాలు లేవు.  ఇవి గమనిస్తున్న వారు మాత్రం నిమ్మగడ్డ ఒక ప్రక్క ప్రభుత్వంతో గొడవ పడుతున్నా మరో పక్క సైలెంట్ గా అధికార పార్టీకి సహకరిస్తున్నారనీ అంటున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ పై ప్రజల్లో ఏర్పడిన పచ్చ ముద్రను తొలగించుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా లేక నిజంగానే అధికార పార్టీకి సైలెంట్ గా సహకరిస్తున్నారా అనేది కొద్ది రోజుల్లో వెల్లడి అవుతుందని అంటున్నారు పరిశీలకులు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!