NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Nimmagadda : ఆ ఇద్దరు సీనియర్ ఐఎఎస్‌ల‌పై ఎస్ఈసీ క్రమశిక్షణా చర్యలకు ఆదేశం

Nimmagadda Ramesh Kumar : ఏపి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇద్దరు సీనియర్ అధికారులకు, ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో 3.61 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోయారని పేర్కొన్నారు. సాంకేతిక, న్యాయ చిక్కుల వల్ల 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఈసీ వివరించారు. ఈ ఇద్దరు అధికారులు విధి నిర్వహణలో విఫలమయ్యారనీ, నిబంధనల ఉల్లంఘనను సర్వీసు రికార్డులో నమోదు చేయాలని నిమ్మగడ్డ ఆదేశించారు.

Nimmagadda : Order for SEC disciplinary action against those two senior IAS
Nimmagadda Order for SEC disciplinary action against those two senior IAS

ఈ ఇద్దరు అధికారులను ప్రభుత్వం బదిలీ చేయగా ఆ బదిలీ ప్రతిపాదనను తిరస్కరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ వారిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. ఇటీవల ఎస్ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్, డీజీపీలతో సహా గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే.

Nimmagadda : Order for SEC disciplinary action against those two senior IAS
Nimmagadda Order for SEC disciplinary action against those two senior IAS

Nimmagadda : బుధవారం ఉన్నతాధికారులతో ఎస్ఈసీ సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లు, ఎస్పీ, జడ్పీ సీఈఓలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం (రేపు) సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హజరుకానున్నారు. సమీక్షలో పాల్గొనాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్ లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లు బదిలీ అయ్యారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju