NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda Ramesh Kumar : త్వరలో మరొక నోటిఫికేషన్ – నిమ్మగడ్డ ప్లాన్ ఇదేనా ?

Nimmagadda Ramesh Kumar : ఏపి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ ఈ సీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయం సాధించారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకూ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదంటూ పలువురు మంత్రులు చాలా గట్టిగా చెప్పారు. అయినప్పటికీ తాను ఎన్నికలు నిర్వహించే పదవీ విరమణ చేయాలన్న పట్టుదలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యూహాత్మకంగా అడుగులు వేసి సక్సెస్ సాధించారు. దీంతో రాష్ట్రంలోని గ్రామాల్లో స్థానిక పంచాయతీ ఎన్నికల కోలాహాలం ప్రారంభం అయ్యింది. మొత్తం నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఫిబ్రవరి 21 వ చివరి విడత ఎన్నికలు ముగియనున్నాయి.

 Nimmagadda Ramesh Kumar : Another notification coming soon - is this the Nimmagadda plan?
Nimmagadda Ramesh Kumar Another notification coming soon is this the Nimmagadda plan

అయితే ఈ ఎన్నికలు ముగియగానే మరో ఎన్నికలకు తెరలేపే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మూహూర్తం ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.  ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోమని సర్వోన్నత న్యాయం తేల్చి చెప్పేయడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిలో పనిగా పంచాయతీ ఎన్నికలు అయిన వెంటనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పిబ్రవరి 21 వ తేదీన పంచాయతీ ఎన్నికలు పూర్తి అయిన వెంటే ఆ మరుసటి రోజు అంటే 22 వ తేదీన మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిపికేషన్ వెలువడుతుందని సమాచారం.

ఫిబ్రవరి 9వ తేదీన ప్రారంభమయ్యే పంచాయతీ ఎన్నికల పోలింగ్ 13,17,21 తేదీలతో ముగియనున్నది. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి అయితే ఫిబ్రవరి 22 వ తేదీనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలను రెండు లేదా మూడు విడతల్లో నిర్వహించవచ్చని చెబుతున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను గత ఏడాది మార్చి నెలలో నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న కారణంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాడు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju