NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda : వైసీపీ నుంచి నిమ్మగడ్డ కి ఇన్నాళ్ళకి సరైన సమాధానం చెప్పేవాడు వచ్చాడు ?

Nimmagadda : ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఇప్పటి వరకూ ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ అన్నట్లుగా సాగిన విషయం తెలిసిందే. చివరకు సుప్రీం కోర్టు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరిపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

Nimmagadda : YCP MP warns Nimmagadda
Nimmagadda YCP MP warns Nimmagadda

తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖలో ఓ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపనలో పాల్గొన్న సందర్భంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తమ పార్టీ ఎన్నికలకు భయపడి వద్దనడం లేదన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికలను ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ యే కారణమని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పున గౌరవిస్తామని పేర్కొంటూనే రాష్ట్రంలో ఎవరికి ఆరోగ్యపరమైన గానీ కరోనా పరం గానీ ఇబ్బందులు వచ్చినా దానికి నిమ్మగడ్డ బాధ్యత వహించాలని విజయసాయి రెడ్డి  అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఎస్ఈసీ ఈ ఎన్నికలను నిర్వహిస్తోందని మండిపడ్డారు. 2018లో హైకోర్టు ఎన్నికలు నిర్వహించమని ఆదేశిస్తే ఎస్ఈసీ ఎందుకు ఎన్నికలను నిర్వహించలేదని ప్రశ్నించారు.

Nimmagadda : YCP MP warns Nimmagadda
Nimmagadda YCP MP warns Nimmagadda

విశాఖ రైల్వే న్యూకాలనీ, శ్రీకన్య ధియేటర్ పక్కన ఇందిరా కాలనీలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న మౌలిక వసతుల కల్పనకు ఆయన శంకుస్థాపన చేశారు. స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలకు తాము అండగా ఉంటామని హమీ ఇచ్చారు. పరిపాలనా రాజధాని విశాఖలో సెంటు భూమి కూడా చాలా విలువైనదని చెబుతూ కోర్టు సమస్యలు పరిష్కారం అయిన వెంటనే పేద వర్గాల ఇళ్లకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారని విజయసాయి రెడ్డి తెలిపారు. విజయసాయి వెంట ఎంపి ఎన్ వి సత్యనారాయణ,  ఎమ్మెల్యేల వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju