ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ఈ నెలాఖరుకు ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్ధుల భర్తీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 27న ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఏపి శాసనమండలి సంయుక్త కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు.

శాసన మండలి సభ్యులు చల్లా భగీరథ రెడ్డి పదవీ కాలం గత నెల నవంబర్ 2వ తేదీతో పూర్తికాగా, ప్రస్తుత ఎమ్మెల్సీలు నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, వరహా వెంకట సత్యనారాయణరాజు పెనుమత్స. గంగుల ప్రభాకరరెడ్డిల పదవీ కాలం ఈ నెల 29వ తేదీతో ముగియనున్నది. రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యరుధల ఎన్నికకు సంబంధించి ఫారమ్ – 1 ద్వారా ఎన్నికల ప్రకటన చేశారు ఆర్ఓ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధులు స్వయంగా లేదా వారి ప్రతిపాదకుడి ద్వారా అయినా వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభా భవనంలో రిటర్నింగ్ అధికారి వద్ద లేదా సహాయ రిటర్నింగ్ అధికారి, శాసనమండలి ఉప కార్యదర్శికి వారి నామినేషన్లు సమర్పించవచ్చని సుబ్బారెడ్డి తెలిపారు.
ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 14న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన, 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకూ అసెంబ్లీలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తైన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆర్ఓ సుబ్బారెడ్డి వెల్లడించారు.
సీబీఐ నోటీసుపై వైఎస్ అవినాష్ రెడ్డి స్పందన ఇది