NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

NTR In Politics: తెలుగు రాజకీయం.. మారిన కథ ఇదే..!!

NTR In Politics: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు  1923 మే 28న కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామయ్య దంపతులకు జన్మించారు. నేడు ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా..  రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలు…

NTR In Politics:
NTR In Politics

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు నినాదంతో 1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ..అంటే 1983 జనవరిలో తొలి సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించి అధికారాన్ని దక్కించుకున్నారు. మొత్తం 294 స్థానాలు ఉన్న ఏపి అసెంబ్లీలో 199 స్థానాలు కైవశం చేసుకుని తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. అధికారం చేపట్టిన ఎన్టీఆర్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానమైనది ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గింపు నిర్ణయం. ఇలాంటి పలు వివాదాస్పద నిర్ణయాల కారణంగా ప్రజాభిమానం తగ్గుతూ వచ్చింది.

ఇదే క్రమంలో 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు అప్పటి గవర్నర్ రాంలాల్, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీల లోపాయికారి సహకారంతో ఎన్టీఆర్ ను అధికారం నుండి దింపి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎన్టీఆర్ తిరిగి ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ఎలుగెత్తి చాటారు. నాటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచాయి. ఆ ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే తిరిగి సీఎం పీఠంలో ఎన్టీఆర్ కూర్చున్నారు. ఆ తరువాత సినిమా రంగంలో స్లాబ్ విధానం అమలు చేయడం, శాసనమండలి రద్దు, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కట్టపై (ట్యాంక్ బండ్) తెలుగుజాతి రత్నాల విగ్రహాల ఏర్పాటు వంటి సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. అధికారం చేపట్టిన రెండేళ్లలోనే నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సాధించాలన్న లక్ష్యంతో 1985లో అసెంబ్లీని రద్దు చేసి ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో 202 స్థానాల్లో టీడీపీ విజయదుంధుబి మోగించి తిరిగి అధికారంలోకి వచ్చారు.

NTR In Politics
NTR In Politics

1985 నుండి 89 వరకూ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తాను చెప్పిందే వేదం, తాను చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తూ పరిపాలన సాగించడంతో ప్రజల్లో, పార్టీలో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. 1989 ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రి వర్గాన్ని ఏకపక్షంగా రద్దు చేసి కొత్త మంత్రులను తీసుకుని సంచలనం సృష్టించారు. ఆ కాలంలో జరిగిన కొన్ని కుల ఘర్షణలు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేశాయి. దీంతో 1989 ఎన్నికల్లో అధికారానికి దూరం కావాల్సి వచ్చింది.

Read More: Video Viral: ఏసీబీ అధికారినంటూ పోలీసులనే బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి..!!

అయితే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినా దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఒక తాటిపైకి తీసుకువచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భూమికను పోషించారు. 1989 నుండి 94వరకూ ప్రతిపక్ష నేతగా ఎన్టీఆర్ ఉన్నారు. 1993లో తన జీవిత కథ రాస్తున్న లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. 1994లో ఎన్నికల్లో కిలో రెండు రూపాయల బియ్యం, సంపూర్ణ మధ్య నిషేదం వంటి హామీలతో ప్రజల్లోకి వెళ్లడంతో తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వంలో, పార్టీలో లక్ష్మీపార్వతి విపరీత జోక్యంతో పార్టీ ముఖ్యనేతలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు 1995 ఆగస్టు నెలలో ఆయనకు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వైశ్రాయ్ హోటల్ క్యాంప్ రాజకీయం నిర్వహించారు. 160 మంది టీడీపీ ఎమ్మెల్యేల మద్దతుతో చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పరిణామంతో ఎన్టీఆర్ రాజకీయ శకం ముగిసిపోయింది. తరువాత 1996 జనవరి 18న ఎన్టీఆర్ గుండెపోటుతో మృతి చెందారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju