AP Cinema Theatres: ప్రభుత్వ ఉత్తర్వులనే సవాల్ చేస్తారా..? ఇన్ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్..!!

Share

AP Cinema Theatres: ఏపి సర్కార్, సినీ పరిశ్రమకు మధ్య వార్ పీక్స్ కు వెళ్లేట్టుంది. సినీ టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత ఉండాలనీ, సినీ అభిమానులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండాలనీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడితే థియేటర్ల యాజమానులు కోర్టుకు వెళ్లి ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లుబాటు కాకుండా చేశారు. దీంతో ప్రభుత్వం హార్ట్ అయినట్లు ఉంది. ఇప్పటి వరకూ సినిమాటోగ్రఫీ చట్టం గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. సినిమా థియేటర్లపైనా పెద్దగా తనిఖీలు చేసింది లేదు. థియేటర్ల యజమాన్యాలు లైసెన్సుల రెన్యువల్, ఫైర్ సెఫ్టీ నార్మ్స్ పాటిస్తున్నారా లేదా, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంటున్నాయా లేదా. సినిమా హాల్స్ లోని క్యాంటిన్లలో తినుబండారాలు, వాటి ధరలు ఇలా ఉన్న అనేక అంశాలను అధికారులు ఇప్పటి వరకూ చూసి చూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు.

Officials conducted rides on AP Cinema Theatres
Officials conducted rides on AP Cinema Theatres

 

వాస్తవానికి గత కరోనా కాలం నుండి సినీ పరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. కరోనా సమయంలో నెలలు తరబడి సినిమా థియేటర్ లు  మూతపట్టాయి. ఆ తరువాత లాక్ డౌన్ నిబంధనలు సడలింపుల నేపథ్యంలో కొంత కాలం సగం అక్యుపెన్సీతో థియేటర్ లు నడిపారు. ఇక పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొని నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ లు నడుస్తున్న తరుణంలో  ప్రభుత్వం ఈ రంగంపై దృష్టి పెట్టింది. ఇంతకు ముందు థియేటర్ల యాజమాన్యం టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నా, థియేటర్లలో సినిమాటోగ్రఫీ చట్ట నిబంధనలు పాటించకపోయినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ ధరలను నియంత్రిస్తూ జీవో 35 తీసుకువచ్చింది. టికెట ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత డీ సురేష్ బాబు తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించలేదు. ఈ తరుణంలో పలువురు థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వ జీవో 35ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు సదరు జీవోను నిలుపుదల చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది.

సినిమా టికెట్లకు సంబంధించి ప్రతిపాదనలు జాయింట్ కలెక్టర్ వద్ద ఉంచాలనీ, జాయింట్ కలెక్టర్లు నిర్ణయిస్తారని పేర్కొంది. అదే విధంగా ప్రభుత్వాన్ని ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ దాఖలు చేసింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించి హైకోర్టుకు యాజమాన్యాలు వెల్లడం అధికారుల ఆగ్రహానికి కారణమైనట్లుంది. సినిమాటోగ్రఫీ చట్టం దుమ్ము దులిపారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలకు అధికారులు సమాయత్తం అయ్యారు. ఈ క్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీల ప్రక్రియ షురూ చేశారు. నిబంధనలు పాటించని పలు థియేటర్ లను సీజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వరుస తనిఖీలతో థియేటర్ల యాజమాన్యాలు బెంబేలెత్తిపోతున్నారు. టికెట్ ధరల తగ్గింపుతో ఇప్పటికే తీవ్ర నష్టపోతున్నామని థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 


Share

Related posts

AP CM YS Jagan: హస్తినకు చేరుకున్న తెలంగాణ సీఎం కేసిఆర్..! పర్యటన రద్దు చేసుకున్న ఏపి సీఎం జగన్..! కారణం ఏమిటంటే..?

somaraju sharma

అమరావతి సాక్షిగా జగన్ నయా స్కెచ్.. దీన్ని ఆపడం కష్టమే!

somaraju sharma

YSRCP: టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరుతున్న మరో మాజీ మంత్రి..! ఎవరంటే..?

somaraju sharma