AP Power Holiday: వైసీపీ సర్కార్ పరిశ్రమలకు మరో సారి పవర్ హాలిడే ప్రకటించింది. ఇప్పటికే పరిశ్రమలు విద్యుత్ సరఫరా కొరతతో ఇబ్బందులు పడుతుండగా వారానికి ఒక రోజు పవర్ హాలిడేను ప్రకటిస్తూ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు పరిశ్రమలకు పవర్ హాలిడే అమలుకు అనుమతించాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అంగీకారం తెలిపింది. ఈ నెల 5వ తేదీ (రేపటి) నుండి 15వ తేదీ వరకూ షరతులతో కూడిన పవర్ హాలిడే కి అనుమతిస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో రోజు వారి అవసరాలకు ప్రస్తుతం 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. ధర్మల్, హైడల్, గ్యాస్, పవన, సోలార్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇంకా 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి.
40 మిలియన్ యూనిట్ లను డిస్కం లు బహిరంగ మార్కెట్ నుండి కొంటున్నాయి. బహిరంగ మార్కెట్ లో దొరక్కపోవడంతో రోజుకు సుమారు 4- 5 మిలియన్ యూనిట్ ల విద్యుత్ సర్దుబాటు సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు గృహ, వ్యవసాయ, విద్యుత్ కనెక్షన్లకు ఇచ్చే విద్యుత్ లో డిస్కంలు కోతలు పెడుతున్నాయి. డిమాండ్ సర్దుబాటు కోసం 15వ తేదీ వరకూ పరిశ్ర్రమలకు విద్యుత్ విరామాన్ని ఇస్తున్నట్లు ప్రకటన వెలువడింది. బల్క్ డ్రగ్స్, ఫార్మాసూటికల్స్, వైద్య, అక్సిజన్ ప్లాంటు, రైస్ మిల్లింగ్ యూనిట్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. నియంత్రణ చర్యలు పాటించని పరిశ్రమలకు జరిమానా విధిస్తామని ఉత్తర్వులో పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లో మాత్రమే పవర్ హాలిడే అమలు చేస్తున్నామనీ, విద్యుత్ లభ్యత మెరుగైతే పవర్ హాలిడే ఎత్తివేస్తామని సీఎండీ లు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలలోపే పరిశ్రమలు ఒక షప్ట్ మాత్రమే పని చేయాలనీ, సాయంత్రం 6 గంటల తరువాత విద్యుత్ వినియోగానికి అనుమతించేది లేదని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912 కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని వారు సూచించారు.
గత ఏడాది వేసవిలో పరిశ్రమలకు పవర్ హాలిడే ని ప్రభుత్వం ప్రకటించింది. దాని ద్వారా ఆదా చేసే 20 మిలియన్ యూనిట్ ల విద్యుత్ ను గృహ అవసరాలకు సరఫరా చేసింది. ఈ ఏడాది వేసవిలో కోతల గండ నుండి గట్టెక్కామని పారిశ్రామిక వేత్తలు భావించారు. అంతలోనే ప్రభుత్వం మరో సారి ప్రభుత్వం కోతలు పెట్టింది.
Congress: మా దగ్గర ఆ పప్పులు ఉడకవు .. ఎంట్రీ ఇవ్వకుండానే వైఎస్ షర్మిల గాలి తీసేసిన సోనియా గాంధీ !