Andhra Pradesh: ఏపీలో క‌రోనా….ఓ గుడ్ న్యూస్ మ‌రో బ్యాడ్ న్యూస్‌

Share

Andhra Pradesh: దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. మ‌న‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సైతం సెకండ్ వేవ్ మొద‌లైన త‌ర్వాత క్ర‌మంగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. భారీగా న‌మోదు అవుతున్న కేసులు ప్ర‌జ‌ల్లో భ‌యం క‌లిగిస్తున్నాయి. తాజాగా ఏపీలో ఓ గుడ్ న్యూస్ మ‌రో బ్యాడ్ న్యూస్ తెర‌మీద‌కు వ‌చ్చింది. గ‌త 24 గంట‌ల్లో ఏపీలో 17,354 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 64 మంది మృతి చెందారు. ఇదే స‌మ‌యంలో కొత్త కోవిడ్ కేర్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

ఇదే బ్యాడ్ న్యూస్
ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. రాష్ట్రంలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10,98,795కు చేరుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 9,67,823 మంది డిశ్చార్జ్ అయ్యారు. 7,992 మంది కోవిడ్ బారిన‌ప‌డి మృతిచెంద‌గా.. ప్రస్తుతం 1,22,980 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 7749 మంది కోవిడ్ కేర్ సెంటర్లల్లో ఉన్నార‌ని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య 15 వేలకు చేరొచ్చుఅని అంచ‌నా

గుడ్ న్యూస్ ఏంటంటే…

ఆక్సిజన్ సరఫరాను మరింత పెంచాలని కేంద్రాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కోరింది. దీంతో త్వ‌ర‌లో ఏపీకి రెండు ట్యాంకర్లు అందుబాటులోకి రానున్నాయి. 30,559 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. మే నెలలో 9,90,700 కోవీషీల్డ్, 3,43,930 కోవాగ్జీన్ డోసుల కొనుగోళ్లకు అవకాశం ఉంది. మ‌రోవైపు త్వ‌ర‌లో కోవిడ్ కేర్ సెంటర్లు కొత్తవి ప్రారంభించ‌నున్నారు.
క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉంటే కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నాము. శ్రీ సిటీలో క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్టు సమాచారం ఉన్న నేప‌థ్యంలో త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.మొత్తంగా కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స విష‌యంలో ఏపీ స‌ర్కారు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది.


Share

Related posts

couples: మీ భాగస్వామి ఎప్పుడు మీ చుట్టూ తిరగాలంటే ఇలా చేయండి !!

siddhu

చంద్ర‌బాబు బ‌ల‌హీన‌త మీద కొట్టిన జ‌గ‌న్‌?!

sridhar

రాజధాని గ్రామాల్లో రైతులు అరెస్టు

Mahesh