NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Panchayat polls : హామీల బాండు..ఓటు కోసం ఇదో బ్యాండు ..! ఈ హామీల పత్రం చూడండి బాసూ..!!

Panchayat polls : ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలుపునకు అనేక రకాలుగా పాట్లు పడుతుంటారు. గ్రామంలో ఆ పనులు చేస్తాం, ఈ పనులు చేస్తామంటూ హామీల హామీలు ఇస్తుంటారు. ప్రచార పర్వం పూర్తి అయిన తరువాత ఓటర్ల కు మందు, మనీతో పాటు ప్రత్యేక తాయిలాలు .అందజేయడం చూశాం. కానీ ఓ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఉచిత హామీలను ఇవ్వడం ఒక ఎత్తు అయితే వాటిని బాండు పేపరు పై ప్రమాణ పత్రంగా రాసి ఇవ్వడం మరోక ఎత్తు. నిజంగా ఆ హామీలను అమలు చేయాలంటే ఆయనకు ఉన్న ఆస్తులను అమ్మాల్సిందే. అయితే ఆ నాయకుడు ఇచ్చిన హామీ పత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్ లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఆదివారం జరుగుతున్న నేపథ్యంలో రెండు రోజుల ముందు ఈ హామీ పత్రాన్ని ఆ నేత విడుదల చేస్తూ గ్రామంలోని 14 వార్డులలో పెద్దలకు అందజేశారు.

Panchayat poll : promises in bond paper
Panchayat poll promises in bond paper

Panchayat polls : హామీల్లో నయా ట్రెండ్

రాజకీయ పార్టీల నేతల ఎన్నికల హామీలను ఎన్నికల తరువాత మరచిపోతారని, పట్టించుకోరన్న అభిప్రాయం చాలా మందిలో ఉండనే ఉంది. అందుకే నేమో ప్రజల్లో నమ్మకం కల్గించేందుకు ఇటీవల బాండు పేపరుపై తమ హామీలను రాసి ఇవ్వడం కొత్త ట్రెండ్ అయిపోయింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సీబీఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ నియోజకవర్గ ప్రజలకు తాను గెలిస్తే ఏమి చేయనున్నారో పేర్కొంటూ ఇచ్చిన హామీలను బాండు పేపరుపై రాసి ఇచ్చిన విషయం చాలా మందికి గుర్తు ఉండి ఉంటుంది. బాండు పేపరు పై హామీలను రాసి ఇచ్చినా ఆ ఎన్నికల్లో జెడి లక్ష్మీనారాయణ పరాజయం పాలైయ్యారు. కాకపోయే రెండు లక్షల పైచిలుకు ఓట్లు రావడం ఆయనకు కొంత ఊరటను ఇచ్చింది. అదే మాదిరిగా నేడు తూర్పు గోదావరి జిల్లాలో ఓ నాయకుడు తమ అభ్యర్థుల గెలుపునకు హామీగా పంచరత్నాలు ప్రకటించారు. ఆ పంచరత్నాలను ఏడాది పాటు అమలు చేస్తానంటూ 20 రూపాయల బాండ్ పేపరుపై ప్రమాణ పత్రంగా రాసి ఇవ్వడం ఆసక్తికరం.

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మేడిశెట్టి సురేఖ, 5వ వార్డు అభ్యర్థిగా కోనాల పేర్రెడ్డి బరిలో ఉన్నారు. వీరికి మద్దతు ఇస్తున్న వైసీపీ నాయకుడు పడాల రంగారెడ్డి.. వీరిని ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. రంగారెడ్డి ప్రకటించిన పంచ రత్న హామీలు చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇవి అమలు చేయాలంటే సొంత ఆస్తులను అమ్ముకోవాల్సిందేనంటున్నారు.

ఇంతకూ ఆయన ఇచ్చిన హామీలు ఏమిటంటే…1. సంవత్సరం పాటు కేబుల్ ప్రసారాలు ఉచితంగా అందించడం, 2. గ్రామంలో ఏడాది పాటు రేషన్ సరుకులు ఉచితంగా అందించడం, 3. ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ఉచితంగా మంచినీళ్లు అందించడం, 4. గ్రామస్తులకు ఏడాది పాటు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించడం, 5.. ప్రతిభ కనబర్చిన పది మంది విద్యార్థులకు ఒక్కొరొక్కరికి రూ.10వేలు చొప్పున అందించడం. అంతే కాకుండా 2022 – 23 సంవత్సరానికి గాను ఇంటి పన్ను, నీటి కళాయి పన్నులను రద్దు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశీస్సులతో ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి ఏడాది పాటు అందిస్తానని రంగారెడ్డి హమీ ఇచ్చారు. ఈ హామీలను గ్రామ ప్రజలు నమ్ముతారో లేదో బాండ్ పేపరు హామీ పత్రంపై ఓటర్ల తీర్పు ఎలా ఏ విధంగా ఉంటుందో ఆదివారం సాయంత్రానికి తెలిసిపోనుంది.

Panchayat poll : promises in bond paper
Panchayat poll promises in bond paper

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!