NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Panchayati : పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు కొత్త భయం ..! అదేమిటంటే..?

Panchayati : ఏపిలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రక్రియలో ఒక ఘట్టం పూర్తి అయ్యింది. మొత్తం నాలుగు దశలో ఎన్నికల్లో జరుగుతుండగా మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 9వ తేదీన జరగనున్నది. చెదురు మదురు సంఘటనలు మినహా తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగానే ముగిసింది. పలు గ్రామాల్లో ప్రత్యర్థులను నామినేషన్ లు వేయకుండా అడ్డుకున్న సంఘటనలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అత్యధిక గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థులు తమ తమ నామినేషన్ లు దాఖలు చేశారు.

Panchayati : New fear for candidates in panchayat elections ..! That is ..?
Panchayati New fear for candidates in panchayat elections That is

ఇదిలా ఉండగా ఈ సారి పోటీ చేసే అభ్యర్థులకు కొత్త భయం పట్టుకుంది. సహజంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుడి ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రతి ఓటూ కీలకమే. గ్రామాల్లో అధిపత్యం కోసం కొన్ని గ్రామాల్లో ఎంత ఖర్చు చేయడానికైనా నాయకులు వెనుకాడరు. ఇప్పటికే పలు గ్రామాల్లో సర్పంచ్ పదవికి వేలం పాటలను నిర్వహించగా ఓ గ్రామంలో రూ. 62 లక్షలు, మరో గ్రామంలో 60లక్షలు, ఊంకో గ్రామంలో రూ. 32 లక్షలకు సర్పంచ్ పదవి ఆశిస్తున్న నాయకులు పాడుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల రహితంగా జరుగుతాయని పేరే గానీ ఆయా రాజకీయ పార్టీల నేతలు అభ్యర్థులను బలపర్చి వారి గెలుపునకు ప్రచారం చేస్తుంటారు.

ఏపి పంచాయతీ ఎన్నికల్లో తొలి సారిగా నోటా గుర్తును బ్యాలెట్ పేపరుపై ముద్దించనున్నారు. ఇదే ఇప్పుడు అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇంతకు ముందు పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో నోటాకు పోల్ అయిన ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపాయి. ఇది తలుచుకునే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 2019 జనవరిలో తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లోనూ నోటా ఓటు ముద్దించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటరు నోటా ఓటు వేస్తుంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో అయిదారు డివిజన్ లలో నోటాకు వచ్చిన ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావితం చూపాయి. విజయం సాధించిన అభ్యర్థులు మెజార్టీ కంటె నోటాకు ఎక్కవ ఓట్లు పోల్ అయిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే అభ్యర్థులకు భయంగా మారుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju