NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Gutti (Anantapur): అనంతలో దారుణం .. రైలులో సీటు కోసం గొడవ

Advertisements
Share

Gutti (Anantapur): అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పద్మావతి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో సీటు విషయంలో గొడవ తలెత్తడంతో ఇద్దరు దుండగులు ఓ ప్రయాణీకుడిని రైల్ లో నుండి తోసేశారు. ప్రయాణీకుడు రమేష్ కుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం రమేష్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో సీటు కోసం గొడవ పడుతున్న వారిని నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన ప్రయాణీకుడిని ఇద్దరు వ్యక్తులు రైలులో నుండి తోసేశారు.

Advertisements

 

దీంతో ప్రయాణీకుడు రమేష్ కుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిది అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం కమ్మవారిపల్లె గ్రామం. బాధితుడు రమేష్ కుమార్ నేరుగా 108కు సమాచారం ఇచ్చి అంబులెన్స్ రాగానే ఆసుపత్రికి చేరి చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisements

రైలులో చోరీ

మరో వైపు రైలులో చోరీ ఘటన కలకలం రేపింది. రన్నింగ్ రైల్ లో చైన్ లాగి నిద్రిస్తున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను దోచుకువెళ్లారు. చెన్నై నుండి షిర్డికి వెళుతున్న షిర్డీ సాయి ఎక్స్ ప్రెస్ రైలు వేకువజాము 2.30 గంటలకు ఇస్పీ – కుప్పగల్లు రైల్వే స్టేషన్ మధ్య రైలులో చైన్ లాగడంతో ఆగిపోయింది. ఎస్ 1, ఎస్ 9 స్లీపర్ బోగీల దగ్గరకు వచ్చిన దొంగలు కిటికీల పక్కన నిద్రిస్తున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారు. అయితే బాధితులు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. షిర్డీ సాయి ఎక్స్ ప్రెస్ కు స్టాపింగ్ చైన్ లాగింది వాస్తవమేననీ, అయింతే ఎవరూ కూడా చైన్ స్నాచింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయలేదని రైల్వే ఎస్ ఐ తెలిపారు.

లోకేష్ పై ఆర్జీవీ సెటైర్ .. ఆస్కార్ ఇవ్వాల్సిందే..


Share
Advertisements

Related posts

జ‌గ‌న్ చేస్తున్న త‌ప్పు ఏంటో ఇప్పుడు తెలిసిపోయింది

sridhar

జబర్దస్త్ లో అడుగుపెట్టిన జూనియర్ సమంత.. అనసూయకు పోటీ ఇవ్వడానికేనా?

Varun G

Chandrababu Arrest: చంద్రబాబు కేసులు .. ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టులోనూ వాయిదా

somaraju sharma