NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప‌వ‌న్ పోటీ ఎఫెక్ట్‌.. పిఠాపురానికి మూడు ఎమ్మెల్సీలా…!

పిఠాపురం అసెంబ్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో అక్కడ రాజకీయం రంజుగా మారింది. పవన్ పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటన చేసిన వెంటనే.. తెలుగుదేశం, వైసీపీ నేతలు ప్రకంపనలు మొదలయ్యాయి. ఎలాగైనా పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని తెలుగుదేశం నేతలకు చంద్రబాబు.. అక్కడ పదవులను ఎరవేస్తుంటే.. ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను ఓడించాలని వైసీపీ అధినేత జగన్ అక్కడ పార్టీ నేతలకు ఎమ్మెల్సీలు ఎరగా వేస్తున్నారు. ఇక పవన్‌కు సీటు ఇవ్వడంతో అక్కడ టీడీపీ సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే వర్మను చంద్రబాబు స్వయంగా పిలిచి బుజ్జగించుకున్నారు.

పవన్‌ను గెలిపించుకుని వస్తే వర్మను తొలి జాబితాలోనే ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో వర్మ కాస్త చల్లబడి పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తానని ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కూడా పవన్‌ను ఓడించేందుకు పిఠాపురం పై స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అక్కడ కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పవన్‌పై పోటీ చేయిస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు.. తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న జగన్ దొరబాబును స్వయంగా పిలిపించుకొని మరీ వైసీపీ గెలుపు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. పిఠాపురంలో వంగా గీత గెలుపుకు కృషి చేయాలని గీతను గెలిపించుకుని వస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ దొరబాబుకు హామీ ఇచ్చారు. జగన్ స్వయంగా పిలిచి చెప్పడంతో.. ఇప్పుడు పిఠాపురంలో దొరబాబు యాక్టివ్‌ అయ్యారు. ఇక ముద్రగడ కూడా వైసిపి చెంత చేరారు. ఎన్నికల తర్వాత ముద్రగడ లేదా ఆయన కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని టాక్ ?

ముద్ర‌గ‌డ‌కు అయితే ఎమ్మెల్సీతో పాటు.. మంత్రి పదవి ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా పిఠాపురంలో పవన్ ఎంట్రీతో ఆ నియోజకవర్గం పేరు చెప్పుకొని స్థానికంగా చాలామందికి ఎమ్మెల్సీ పదవులపై హామీలు వస్తున్నాయి.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N