29.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జనసేనాని ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ రంగులపై పేర్ని వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇలా..

Share

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార పర్వానికి ప్రత్యేకంగా రూపొందించుకున్న వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వాహనం రంగులపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం వివాదాస్పదం అయ్యింది. మాజీ మంత్రి, మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని సైతం పవన్ వాహనంపై విమర్శలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కనీసం ముదురు ఆకుపచ్చ రంగు చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ పవన్ ట్వీట్ చేశారు. ముందుగా తన సినిమాలను అడుకున్నారు, ఆపై విశాఖ వెళ్తే హోటల్ గది నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు. విశాఖ నగరం నుండి బలవంతంగా పంపించేశారు. మంగళగిరిలో కారులో వెళ్తుంటే అడ్డుకున్నారు. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళుతున్నా ఆపేశారని ఆక్షేపణ వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వాహనం రంగుపైనా వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక పై శ్వాస తీసుకోవండం కూడా ఆపేయమంటారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

Pawan Kalyan Counter on Perni Nani Comments

 

అంతకు ముందు జనసేన ప్రచార రథం వారాహి పై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి చీవాట్లు తిన్న నాయకులా తమకు నీతులు చెప్పేది అని విమర్శించారు. జనసేన ప్రచార రథం అలివ్ గ్రీన్ రంగులో ఉండటంపై పేర్ని నాని ఏమన్నారంటే.. అలివ్ గ్రీన్ రంగు కేవలం మిలిటరీ వాహనాలకు మాత్రమే వాడతారని, వారాహికి ఆ రంగు వేయడం చట్ట విరుద్దమని అన్నారు.

Pawan Prepares with varah for assembly election campaign

 

లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కు మోటారు వెహికల్ యాక్ట్ పుస్తకాన్ని చదివే సమయం దొరకలేదా అని ప్రశ్నించారు. వారాహికి తెలుపు, నలుపు మరో రంగు కాకుండా మీరు ఎటూ రంగు మార్చాలి కదా అదేదో పసుపు రంగు వేసుకుంటే సరిపోతుంది, మీరు టీడీపీతో కలిసి వెళ్లే వారే కదా, ఇప్పుడేదో ప్రధాని మోడీ చెప్పడంతో నాలుగు రోజులు ఆగారు కదా అంటూ సైటైర్ లు వేశారు. ప్రతి ఒక్కరూ వ్యాన్లను కొనుక్కుని యుద్దం చేస్తామంటే కుదరదనీ, ఇలాంటివి సినిమాల్లోనే నడుస్తాయని, నిజ జీవితంలో కుదరవని పేర్ని నాని విమర్శించారు.


Share

Related posts

WhatsApp: వాట్సాప్ లో మరో కొత్త లోపాన్ని గుర్తించిన భద్రతా నిపుణులు..!!

bharani jella

రామోజీ రావు, ఏబీఎన్ ఆర్కే ని కోర్టు మెట్లు ఎక్కించబోతున్న జగన్ …??

sekhar

శ్రీశైలం జలాశయంలో జలకళ… క్రస్ట్ గేట్లను ఎత్తనున్న ఏపి మంత్రి అంబటి రాంబాబు

somaraju sharma