NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ డైలాగ్ చెప్పిన మోడీ … కొత్త సంవ‌త్స‌రం ఎఫెక్ట్‌

బీజేపీ , జన‌సేన పార్టీలు మిత్ర‌ప‌క్షాల‌నే సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌నంత తానుగా బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇలాంటి స‌మ‌యంలో బీజేపీ ర‌థ‌సార‌థి , ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మాట‌ల‌ను జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ల్లె వేయాలి. కానీ తాజాగా సీన్ రివ‌ర్స్ అయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాపుల‌ర్ డైలాగ్‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పేర్కొన్నారు.

 

మోడీ ఏమ‌న్నారంటే…

గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఎయిమ్స్ ఆసుపత్రికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అనంత‌రం ఆయ‌న ప్ర‌సంగిస్తూ మనం కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నామని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు చెందిన ఓ సినిమా డైలాగ్ ప్ర‌స్తావించారు. కొత్త సంవత్సరంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుందని, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ఇండియాలో ప్రారంభం కాబోతున్నట్టు ప్రధాని మోడీ ప్ర‌క‌టించారు. ఇండియాలో తయారైన వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని, వ్యాక్సిన్ తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలని కరోనా నిబంధనలు పాటించాలని మోడీ పేర్కొన్నారు. ప్రపంచ మెడికల్ హబ్ గా ఇండియా మారుతున్నట్టు మోడీ తెలిపారు. ఇండియాలో మెరుగైన వైద్యం, మెడిసిన్ విద్య లభిస్తోందని తెలిపారు.

ఇంత‌కీ టీకా ఎప్ప‌టి నుంచో….

మ‌రోవైపు క‌రోనా వ్యాక్సిన్ పై అంద‌రి దృష్టి ప‌డింది. అయితే, కేంద్రం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 2 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మాక్ డ్రిల్ తరువాత దేశంలో వ్యాక్సిన్ పంపిణి ఉంటుంది. ఇటీవలే కేంద్రం దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ ను నిర్వహించింది. నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ డ్రైరన్ సక్సెస్ కావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు హైలెవల్ కమిటీ నుంచి సమాచారం అందింది.

టీకాల సంగ‌తి ఏంటి?

భార‌త‌దేశంలో అందించేందుకు కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్, ఫైజర్ టీకాలు అత్యవసర అనుమతుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన టీకాకు యూకే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 4 నుంచి యూకేలో ఈ టీకా అందుబాటులోకి వస్తుంది. కాగా, కోవిషీల్డ్, కోవాగ్జిన్, ఫైజర్ టీకాలకు పై నేడో రేపో డీజీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు స‌మాచారం.

author avatar
sridhar

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!