Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం కాకినాడలో బహిరంగ నిర్వహించారు. వైసీపీ స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. తాను ఓడిపోయానని పదే పదే ద్వారంపూడి అంటున్నారనీ, ఆయన నోటి దూల ఎక్కువైందని మండిపడ్డారు. డెకాయిట్ ద్వారంపూడి కి బుద్ది చెప్పడానికి తాను వచ్చినట్లు తెలిపారు. ద్వారంపూడి కుటుంబ సభ్యులు గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చిన చరిత్ర ఉందన్నారు. నాయకుడు సరిగా లేకపోతే పాలన అస్తవ్యస్థమవుతుందన్నారు.

కాపు మహిళలను కాపు రౌడీలతో కొట్టించారని మండిపడ్డారు. కుల దూషణతో రెచ్చగొడితే మర్యాదగా ఉండదని అన్నారు. ముఖ్యమంత్రి అండ చూసుకుని ద్వారంపూడి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ద్వారంపూడి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే గోదావరి జిల్లాలకు తానే ముఖ్యమంత్రి అన్నట్లుగా ఉందని విమర్శించారు. ద్వారంపూడి ట్రస్ట్ స్థలాలను కొట్టేశాడని ఆరోపించారు. ఏమూలకు వెళ్లినా ఈ ఎమ్మెల్యే దోపిడీ కనిపిస్తుందని అన్నారు. నిన్న కాకినాడ జనవాణి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మీద చాలా ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. బియ్యం స్మగ్లింగ్ సహా అనేక రకమైన పిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సారి ఎన్నికల్లో ద్వారంపూడిని గెలవనివ్వను అంటూ పవన్ కళ్యాణ్ శపథం చేశారు.
ఎస్సీ డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేస్తే ఎస్సీ నేతలు మాట్లాడరా అని ప్రశ్నించారు. ఎంపి కుటుంబాన్నే కిడ్నాప్ చేశారంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తొందన్నారు. మంగళగిరిలోనే ఉంటా.. ఏ గుండా వస్తాడో రమ్మనండి.. చూసుకుందాం అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలో కులం అనే భావన అందరిలో ఉందనీ, మన రాష్ట్రం మన ఏపీ అని అందరూ అనుకోవాలన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాగా మార్చేశారని దుయ్యబట్టారు. గంజాయి మత్తులో యువత నేరాలు చేస్తొందని అన్నారు. శాంతి భద్రతలపై విశాఖలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు లోతుగా అర్ధం చేసుకోవాలని అన్నారు పవన్ కళ్యాణ్.
Breaking: విద్యార్ధులకు అలర్ట్ .. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం