NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: పర్చూరు సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 80 మంది కౌలు రైతులకు లక్ష వంతున ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా వరకూ వైసీపీ వాళ్లు ఏమి మాట్లాడినా భరిస్తామనీ, అప్పటి నుండి ప్రజల్లోనే ఉండి వాళ్ల సంగతి చూస్తామని అన్నారు. పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదనీ, పాత్తు ప్రజలతోనే ఇంకెవరితోనూ లేదని అన్నారు. 2024 లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసిస్తున్నారనీ, రాజకీయ కక్ష తీర్చుకోవడానికే మాత్రమే అధికార యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

Pawan Kalyan speech in parchur
Pawan Kalyan speech in parchur

సరిగా పని చేయకపోతే రెండేళ్ల తర్వాత రీకాల్ చేసే విధంగా చట్టం రావాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కాకపోతే రాజకీయాల్లో నుండి వెనక్కు వెళ్లిపోయేందుకు తాను పార్టీ పెట్టలేదనీ, సరిగా పని చేయకపోతే సీఎం చొక్కా పట్టుకునే విదంగా యువకులను తయారు చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.5 కోట్లు అప్పులు చేసింది. ఆ అప్పు ఏమి చేశారని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించాలన్నారు. వైసీపీ నాయకులకు లక్షల కోట్లు దోపిడీ చేసే సత్తా ఉన్నప్పుడు జనసేనకు రూ.2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉందని అన్నారు.

 

2014 లో తాను పోటీకి దిగి ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి కావని పవన్ అన్నారు. నన్ను దత్తపుత్రుడు అని వైసీపీ విమర్శిస్తుందనీ, తాను కూడా సీబీఐ దత్తపుత్రుడని అనగలనన్నారు. వైసీపీ నాయకులు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బాధ్యతలేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని అన్నారు. రాష్ట్ర ప్రజలకు వచ్చే ఎన్నికలు చాలా కీలకమన్నారు. నిరుద్యోగులకు జనసేన అధికారంలోకి వస్తే జాబ్ కాలెండర్ ప్రకటిస్తామని, రైతు ప్రయోజనాలు కాపాడతామని వాగ్దానం చేశారు. చాలా సార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారు. ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్.

 

ప్రత్యేక హోదా కోసం ప్రధాన మంత్రితో విబేధించాననీ, దాని వల్ల వ్యక్తిగతంగా తాను నష్టపోయానన్నారు. రాజకీయాల్లో ప్రజలు ముందుకు వెళ్లేలా చేయడమే తన తపన అనీ, తనకు వ్యక్తిగత స్వార్ధం ఏమి లేదని అన్నారు పవన్ కళ్యాణ్. తొలుత మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద నుండి రోడ్డు మార్గంగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఏటుకూరు, చిలకలూరిపేట, మార్టూరు,రాజుపాలెం మీదుగా పర్చారు వరకూ భారీ ర్యాలీ గా పవన్ కు స్వాగతం పలికారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju