NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: పవన్ కళ్యాణ్ బిగ్ ఝలక్ ఇచ్చిన విశాఖ ప్రజలు

Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు విశాఖ ప్రజలు బిగ్ ఝలక్ ఇచ్చారు. విశాఖలో పవన్ సభకు జనాలు మొహం చాటేశారు. జనాలు లేక బహిరంగ సభ ప్రాంగణం వెలవెలపోయింది. పవన్ ప్రసంగిస్తున్న సమయంలోనూ ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ సభ పెట్టినా ఇంతకు ముందు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొనేవారు. కానీ విశాఖలో సభ వెలవెలపోయింది. టీడీపీతో పొత్తు ప్రకటన చేయకముందు వరకూ ప్రతి నియోజకవర్గం నుండి జనసేన శ్రేణులు యాక్టివ్ గా పని చేసే వారు. పొత్తు ప్రకటన చేసిన తర్వాత ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారు అనేది తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు పార్టీ కోసం పని చేసినా టికెట్ వస్తుందన్న గ్యారెంటీ లేకపోవడంతో నియోజకవర్గాల నేతలు జన సమీకరణపై దృష్టి పెట్టడం లేదని అంటున్నరు. ప్రముఖ కాంట్రాక్టర్ సుందరపు వెంకట సతీష్ కుమార్ జనసేన పార్టీలో చేరిక సందర్భంగా గురువారం విశాఖలోని ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ అని ముందుగా అనౌన్స్ చేశారు. జనాలు రాకపోవడంతో దాదాపు మూడు గంటలకుపైగా పవన్ కళ్యాణ్ హోటల్ కే పరిమితమైయ్యారు. గ్రౌండ్ లో సగం వరకే కుర్చీలు వేసినా పూర్తి స్థాయిలో నిండలేదు. జనసమీకరణ చేయడంలో విశాఖ జనసేన నేతలు విఫలమైయ్యారు. మైదానంలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో పవన్ కళ్యాణ్ నేతలపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సభలో సుందరపు వెంకట సతీష్ కుమార్ జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం బహిరంగ సభలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎవ్వరికీ బి పార్టీ కాదని అన్నారు. తాము తెలుగు దేశం పార్టీ వెనక నడవట్లేదు, తెలుగు దేశంతో పాటు కలిసి నడుస్తున్నామని పేర్కొన్నారు. జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా.. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయను అని స్పష్టం చేశారు.  పదవుల కోసం తాను ఎప్పుడూ ఆలోచించలేదనీ, మీ ప్రేమ, అభిమానంతోనే పార్టీని నడపగలుగుతున్నానని అన్నారు. అధికారం కోసం తాను ఓట్లు అడగననీ, మార్పు కోసం ఓట్లు అడుగుతానని అన్నారు. ఉత్తరాంధ్ర చైతన్యం ఉన్న నేల.. అందరినీ ఆహ్వానించే నేల అని అన్నారు.

ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారనీ, ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలన్నారు. ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉండాలని అన్నారు. జనసేనకు ఒక్క ఎంపీ ఉంటే .. విశాఖ స్టీల్ ప్లాంట్ గనులు తెచ్చే వాడినని అన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కరు మాట్లాడటం లేదని అన్నారు. జనసేనకు అండగా నిలబడితే స్టీల్ ప్లాంట్ కోసం తాను పోరాటం చేస్తానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని అబివృద్ధి దిశగా నడిపించాల్సి ఉందన్నారు. సీఎం ఎవరు అనేది తాను, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి నిర్ణయిస్తామని చెప్పారు.

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju