Janasena: జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ మహాసభలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఏపీలో యువత కులాలను దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేయకూడదని సూచించారు. సమాజంలో ఒకరి అవసరం మరొకరికి ఉంటుందని కులాలకు అతీతంగా ఆలోచించాలని సూచించారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో పొత్తుల విషయానికి సంబంధించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి అండగా నమ్మకం మరియు భరోసా ప్రజల నుండి సంపుర్ణమైన నమ్మకం వస్తే ఒంటరి పోరు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే జనసేన ఒంటరిగా పోటీ చేసి గెలుస్తుందని క్షేత్రస్థాయి నుంచి రిపోర్టులు వస్తే సింగిల్ గా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా తాను తిరగటంతో పాటు ప్రజల అభిప్రాయనీ డేటా రూపంలో కలెక్ట్ చేస్తామని పవన్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో గజమాలలకు బదులు ఓట్లు వేయాలని.. ప్రజలను కోరుతున్న. గుండెలు బాదుకోవటం కాదు గుండెల్లో పెట్టుకోవాలి. వైసీపీ నాయకులు జనసేన పై అడ్డగోలుగా మాట్లాడితే.. దిక్కులేని బతుకులైపోతాయి అని పవన్ హెచ్చరించారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ప్రేమ ఏమీ లేదని అన్నారు. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబుపై గౌరవమే ఉందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులపై నేనెప్పుడూ మాట్లాడలేదు.
సోషల్ మీడియాలో వచ్చే వాటికి నేనేమీ చేయలేను. ఈసారి ఎన్నికలలో జనసేన ఎట్టి పరిస్థితుల్లో బలి పశువు కాదు. అసెంబ్లీలో అడుగు పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తాం. నాతో పాటు పోటీ చేసే ప్రతి ఒక్కరు గెలుస్తారు. నా దగ్గర డబ్బులు లేవు. ప్రజలే నన్ను గెలిపియాలి అని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. వేదికపై రాకముందు పవన్ వారాహి వాహనంతో ప్రజలను పలకరించడం జరిగింది.
AP High Court: ఆ అంశంలో జగన్ సర్కార్ నిర్ణయాన్ని సమర్ధించిన ఏపి హైకోర్టు..!!