NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో అధికారం ఎవరిది అన్న విషయం పక్కకు పెడితే… అందరికన్నా పిఠాపురం నియోజకవర్గం పైన ఉంది. దీనికి ముఖ్య కారణం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్… ఇప్పుడు నియోజకవర్గాన్ని మార్చడమే కాకుండా… పొత్తుతో ముందుకు వెళ్తున్నాడు.

దీంతో ఈసారైనా ఎమ్మెల్యేగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుస్తాడని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా పిఠాపురంలో…. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. అటు మెగా హీరోలు కూడా అదే పనిలో ఉన్నారు. రోజుకో హీరో వచ్చి పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గెలుపు సులువు చేసేందుకు ముద్రగడ ఫ్యామిలీ రంగంలోకి దిగింది. అదేంటి ముద్రగడ వైసిపిలో ఉన్నాడు కదా…? పవన్ కళ్యాణ్ కోసం పనిచేయడం ఏంటి అని అనుకుంటున్నారా ?

ముద్రగడ పద్మనాభం వైసిపి లో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి మాత్రం జనసేనకు జై కొట్టింది. అన్యాయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసిపి కుట్రలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. దానికి తన తండ్రి కూడా సపోర్ట్ ఇవ్వడం దారుణం అన్నారు. తాను మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను గెలిపించేందుకు కృషి చేస్తానని ఆమె ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను వీడియోలో చేశారు.

దీంతో పిఠాపురం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముద్రగడనేమో వైసీపీ కోసం పని చేస్తే… ఆయన కూతురు మాత్రం జనసేన కోసం పనిచేస్తుందని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. అయితే జనాల్లో కన్ఫ్యూజన్ లేకుండా, కొత్త అనుమానాలు రాకుండా ఉండేందుకు… స్వయంగా ముద్రగడ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తన కూతురి అభిప్రాయానికి తనకు ఎలాంటి సంబంధం లేదని… ఒకసారి పెళ్లి చేశాక ఆమెకు నాకు ఎలాంటి రిలేషన్ లేదన్నారు.

రాజకీయాలు రాజకీయాలే… కూతురు కూతురే అన్నట్లు వ్యవహరించారు ముద్రగడ. తన కూతురిని బెదిరించి మరి… చంద్రబాబు టీం ఇలా చేపిస్తోందని ఆయన ఆరోపించారు. మొత్తానికి ముద్రగడ కూతురు పెట్టిన చిచ్చు… జనసేన పార్టీకి చాలా ప్లస్ అయిందని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ కోసం పనిచేస్తున్న ముద్రగడ కుటుంబంలోనే చీలిక వచ్చిందని… అలాంటి వ్యక్తి మాటలు మనమెందుకు వినాలని… కాపులు, అలాగే పిఠాపురం నియోజకవర్గ ఓటర్లు అనుకుంటున్నారట. మరి ముద్రగడ కుటుంబ ప్రభావం పిఠాపురం నియోజకవర్గంలో ఎంత మేరకు ఉంటుందో చూడాలి.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N