NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: జగన్ రెండేళ్ల పాలనపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!!

AP CM YS Jagan: ఓ పక్క వైఎస్ జగన్మోహనరెడ్డి రెండేళ్ల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94.5 శాతం నెరవేర్చామని వైసీపీ ప్రకటించింది. ఇచ్చిన హామీలనే కాక ఇవ్వని చాలా అమలు చేయడం జరిగిందని చెప్పుకొస్తున్నారు. ప్రజా సంక్షేమానికి జగన్ సర్కార్ పెద్ద పీట వేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కొన్ని ప్రధానమైనవి నెరవేరలేదు. కొన్నింటిని అసలు పూర్తిగా విస్మరించినట్లుగా ఉంది. ఈ సందర్భంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి జగన్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

pcc leader Tulasi reddy comments on AP CM YS Jagan
pcc leader Tulasi reddy comments on AP CM YS Jagan

అబద్దాల ప్రచారంలో జగన్ గ్లోబెల్ ను మించిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబును ఇదే విధంగా గ్లోబెల్ ప్రచారం అంటూ విమర్శించే వారు. అయితే ఇప్పుడు తులసిరెడ్డి ఏమంటున్నారంటే… వైఎస్ఆర్ పెళ్లి కానుక ఏమైందని ప్రశ్నించారు. గతంలో వివిధ వర్గాలకు చెందిన పేదల వివాహ సందర్భంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీలకు రూ.50వేల నుండి లక్ష వరకూ ఆర్థిక సహాయం అందించే వారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కరికీ వైఎస్ఆర్ పెళ్లి కానుక మంజూరు కాలేదు. వైఎస్ఆర్ పెళ్లి కానుకకు సంబంధించి గతంలో కంటే ఆర్థిక సాయం పెంపు ప్రకటన అయితే చేశారు గానీ ఎన్నికలకు ముందు వివాహాలు జరిగిన వారికి ఇంత వరకూ నిధులు విడుదల కాలేదని సమాచారం.

Read More: MP Raghurama: నిన్న రక్షణ మంత్రి, నేడు ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్ ..రేపు ఎవరిని కలుస్తారో రఘురామ..? సీఐడీని వదిలేట్టు లేడుగా..?

మేనిఫెస్టో మాటల్లో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అంటూ చేతల్లో మాత్రం చిత్తు కాగితమని తులసిరెడ్డి విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద రూ.50వేలు ఇస్తామన్నారు. పంట వేసే సమయానికి రూ.12,500లు చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇప్పుడు మాత్రం రూ.7,500లు చొప్పున ఇస్తూ 12,500లు కోత కోసిందని దీన్ని సీఎం ఏమంటారు అని ప్రశ్నించారు. ఏపికి ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారనీ, అది ఏమయ్యిందని ప్రశ్నించారు. ప్రతి ఏడాది జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగ భర్తీకి క్యాలెంటర్ విడుదల చేస్తామన్నారు చేశారా అని తులసిరెడ్డి నిలదీశారు. అగ్రిగోల్డ్ బాధితుల హామీ నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని, సకాలంలో పిఆర్సీ అమలు చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని తులసిరెడ్డి ప్రశ్నించారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!