NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

RRR : మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ ఎంపి రఘురామ కృష్ణం రాజు… రాజీనామాకు సిద్ధమే కానీ..

RRR : రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు (ఆర్ఆర్ఆర్) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చలకు దారి తీస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఎంపి రామకృష్ణంరాజు, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గెలుపును చూసి ఓర్వలేక వీరంతా కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు పెద్దిరెడ్డి. వారికి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప మరొకటి లేదన్నారు. తాను మాట్లాడిన విషయాలను వక్రీకరించి వారికి ఇష్టం వచ్చినట్లు పత్రికల్లో రాశారని ఆరోపించారు.

peddireddy serious comments..RRR reaction
peddireddy serious commentsRRR reaction

చంద్రబాబు నాయుడుకి బంట్రోత్‌గా రఘురామకృష్ణం రాజు వ్యవహరిస్తూ ఆయన స్క్రీన్ ప్లే, డైరెక్టర్‌లో మాట్లాడుతున్నాడని విమర్శించారు. రఘురామ కృష్ణం రాజే బ్లాక్ షీప్, కొమ్ములు లేని దున్నపోతు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వాడిని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపీ  టికెట్ ఇచ్చి గెలిపిస్తే నీచంగా రఘురామకృష్ణం రాజు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను ఏనాడూ రఘురామకృష్ణం రాజును వ్యక్తిగతంగా విమర్శించలేదనీ, మొదటి సారిగా తనపై కుట్ర పూరితంగా మాట్లాడినందుకు స్పందించి ఆయనపై మాట్లాడుతున్నానని అన్నారు. బ్యాంకులను వేలం కోట్లు మోసం చేసిన చరిత్ర రఘురామ కృష్ణం రాజుదని విమర్శించారు. చంద్రబాబు స్ర్కీన్ పే ఆయన చదువుతున్నారని అన్నారు. ఆయనకు దమ్ము దైర్యం ఉంటే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు పెద్దిరెడ్డి.  ఈ వ్యాఖ్యలపై రఘురామకృష్ణం రాజు అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ కు రాజీనామా చేయడానికి సిద్ధమేననీ, అయితే రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే, జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మళ్లీ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటారా అని ప్రతి సవాల్ విసిరారు రఘురామకృష్ణం రాజు. చంద్రబాబుకు నేను బంట్రోత్ గా వ్యవహరించాల్సిన అవసరం లేదని అన్నారు.  ఇసుక ద్వారా ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని విమర్శించారు. “నేను గనుక సీఎం అయితే అన్న నీ మాటల వెనుక ఉద్దేశం ఏమిటో చెప్పాలి, మీ సీఎం అసమర్ధుడా, చేత కాని వాడా అనేది సమాధానం చెప్పాలి” అని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇలా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.

author avatar
Srinivas Manem

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju