YS Jagan: జ‌గ‌న్ చేసిందే… కేసీఆర్ చేయాలంటున్న జ‌నం

Share

YS Jagan: ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిందే… తెలంగాణ సీఎం కేసీఆర్ చేయాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. కీల‌క‌మైన క‌రోనా స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా చికిత్స అందిస్తున్న‌ ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝులిపించారు. కొవిడ్ నిబంధనలు పాటించని పలు ఆస్పత్రులపై ఈ మేర‌కు చర్యలు తీసుకున్నారు. స‌రిగ్గా ఇదే రీతిలో తెలంగాణ ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్తున్నారు.

Read More: KCR: గ్రాప్ పెంచుకున్న కేసీఆర్…గాలి తీసేస్తున్న‌ది ఎవ‌రంటే….

గుంటూరులో ఏం జ‌రిగింది?

ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల ప్రకారం ఆరోగ్యశ్రీ కింద 50శాతం పడకలు ఇవ్వాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలు పాటించని గుంటూరులో 52 క‌రోనా చికిత్స అందిస్తున్న‌ ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు. ఆ 52 ఆస్ప‌త్రుల‌కు రూ.1.25కోట్ల జరిమానా విధించారు. కరోనా చికిత్స విష‌యంలో నిబంధనలు పాటించని ఆస్పత్రుల‌ను గుర్తించి ఈ మేర‌కు త‌గు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ స్ప‌ష్ట‌మైన‌ ఆదేశాలు విజిలెన్స్ అధికారులు ఇవ్వ‌డంతో వారు ఈ మేర‌కు చర్యలు తీసుకుంటున్నారు.

Read More: KCR: తెలంగాణ‌లో కేసీఆర్ దిమ్మ‌తిరిగి పోయే కుంభ‌కోణం బట్ట‌బ‌య‌లు?

తెలంగాణ‌లో ఏంటి ప‌రిస్థితి కేసీఆర్ సార్?

గుంటూరు జిల్లాలో కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌ని 52 ఆస్పత్రులకు భారీగా జరిమానా విధించడం స‌హ‌జంగానే వార్త‌ల్లో నిలిచింది. క‌రోనా మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న సమయంలో హైద‌రాబాద్ కు చెందిన ప‌లు ఆస్ప‌త్రులు వ్యాపార దృక్పథంతో దోచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఆఖ‌రికి శ‌వాన్ని కూడా ఇవ్వ‌డంలో అనేక ఆస్ప‌త్రులు దారుణాల‌కు పాల్ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌క్క రాష్ట్ర సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న‌ట్లే తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి అని ప‌లువురు కోరుతున్నారు.


Share

Related posts

కొత్త జిల్లాల విస్తరణకు ముహూర్తం ఖరారు..??

sekhar

NTR: నెరవేరుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ డ్రీమ్ ప్రాజెక్ట్..??

sekhar

వామ్మో.. ప్రభాస్ ఒక్క యాక్షన్ సీన్ కోసం అన్ని కోట్లా?

Teja