NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇది

జనసేన బస్సు యాత్ర వాయిదా గురించి, వైసీపీకి రాబోయే ఎన్నికల్లో సీట్ల గురించి, రాజధాని అమరావతిపై వైసీపీ మాట మార్చిన విషయంపై జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. దసరాకు వస్తాను.. మీ సంగతి చూస్తాను అన్న పవన్ నాయుడు ఇప్పుడెక్కడ ఉన్నాడు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ దసరాకు పులి వేషం వేసుకొచ్చినా బాగుండేది అని ఎద్దేవా చేశారు.

Perni Nani Counter Comments on Pawan Kalyan

 

చిలక జోస్యంలో కేవలం వైసీపీ సీట్లే వస్తాయా.. జనసేనకు ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తెలియదా అని పేర్ని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పులను జగన్ కు పవన్ ఆపాదిస్తున్నారని విమర్శించారు. పవన్ రాజకీయాలు అన్నీ చంద్రబాబు కోసమేనని అన్నారు. అమరావతి అభివృద్ధి పై చర్చకు తాను సిద్దమనీ పవన్ వస్తారా అని సవాల్ విసిరారు. సొంత అన్నకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. చిరంజీవి ప్రజల కోసం పని చేస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం పని చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేసినన్ని తప్పులు చిరంజీవి చేయలేదని అన్నారు పేర్ని నాని.

పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర వాయిదాపై మాట్లాడుతూ .. పొద్దునేమో లోకేష్ నాయుడు తూచ్ అన్నాడు, మధ్యాహ్నానికి పవన్ నాయుడు తూచ్ అన్నాడనీ, ఇద్దరి యాత్రలకు చంద్రబాబు పర్మిషన్ ఇవ్వాలి కదా అని వ్యంగ్యంగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు కాన్సిల్ చేసుకున్నట్లు.. షూటింగ్ లు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. అడ్వాన్స్ లు ఇచ్చే ప్రొడ్యూసర్లకు ఆయాసం వస్తుందేమో కానీ తను ఆయాసం లేకుండా అడ్వాన్స్ లు తెగ తీసుకుంటారు కదా అని అన్నారు. ఇప్పటి వరకూ అడ్వాన్స్ లు తీసుకున్న సినిమాలు పూర్తి కావాలంటే 2050 వరకూ ఆగాల్సిందేనని పేర్ని అభిప్రాయపడ్డారు.

వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు .. బస్సు యాత్ర వాయిదా .. ఎందుకంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N