ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. కేబినెట్ లో నలుగురు మంత్రులకు ఉధ్వాసన పలికి వారి స్థానంలో నలుగురుకి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వనున్నారని వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ వార్తలపై మాజీ సమాచార శాఖ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై సమీక్ష మాత్రమే జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుత మంత్రివర్గంలో మార్పు జరిగే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఉన్న కేబినెట్ తోనే ఎన్నికలు జరుగుతాయని, ఈ కేబినెట్ తోనే ఎన్నికల్లో గెలుస్తామని పేర్ని నాని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారని చెప్పిన పేర్ని నాని.. పార్టీ అధిష్టానంకు వచ్చే నివేదికల ఆధారంగానే పని చేయని వారిపై సీరియస్ కావడం సహజమేనని అన్నారు. పార్టీ ఇచ్చిన పనులను ఎమ్మెల్యేలు సక్రమంగా చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇదే సందర్భంగా చంద్రబాబు చేసిన కామెంట్స్ పైనా రియాక్ట్ అయ్యారు. 175 నియోజకవర్గాల్లో వైసీపీని ఓడిస్తామంటున్న చంద్రబాబు సైకిల్ గుర్తు 175 నియోజకవర్గాల్లో ఉంటుందా లేదా అన్నది చెప్పాలన్నారు. వయసు మీద పడుతున్న కొద్దీ చంద్రబాబుకు ప్రగల్భాలు ఎక్కువ అయిపోతున్నాయని అన్నారు. తమతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటున్న చంద్రబాబు .. ఆయనతో టచ్ లో ఉన్న వారిని తీసుకువెళ్లవచ్చు కదా.. ఎందుకు తీసుకువెళ్లడం లేదని ప్రశ్నించారు. వైనాట్ పులివెందుల అని టీడీపీ వాళ్లు అంటున్నారనీ, అలా అనేటప్పుడు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ పులివెందుల్లో పోటీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు.
YS Sharmila: కేసిఆర్ సర్కార్ పై నిరుద్యోగ సైరన్ మోగించాల్సిన సమయం ఆసన్నమైందన్న వైఎస్ షర్మిల