NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కుక్కలు, పందుల పెంపకందారులకు ఏపి ప్రభుత్వం షాక్..! ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే..!!

 

ఏపి ప్రభుత్వం రాష్ట్రంలో కుక్కలు, పందుల పెంపకం దారులకు  షాకింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పందుల పెంపకం దారులు ఉంటారు. వారు ఇంత వరకూ పందులకు లైసెన్సులు తీసుకోవడం లేదు. అదే విధంగా రాష్ట్రంలో ఊర కుక్కలు, పెంపుడు కుక్కలు ఉన్నాయి. పెంపుడు కుక్కలకు గతంలో ఎప్పుడో లైసెన్సులు తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ దశాబ్దాల కాలంగా పెంపుడు కుక్కలకు ఎవరూ లైసెన్సులు తీసుకుంటున్న దాఖలాలు లేవు.

అయితే ప్రస్తుతం ఏపి ప్రభుత్వం కొత్తగా కుక్కలు, పందులకు విధిగా లైసెన్సులు తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నేడు దీనికి సంబంధించి ఓ జివో విడుదల చేసింది. లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే రూ.500 జరిమానాతో పాటు రోజుకు రూ.250లు అపరాధ రుసుము వసూలు చేయాలని జివోలో పేర్కొంది. అధికారులు స్వాధీనం చేసుకున్న కుక్కలు, పందులను అవి తమవి అని యజమానులు చెప్పకపోతే (అంగీకరించకపోతే) వాటిని వీధి కుక్కలు, పందులుగా పరిగణించి కుటుంబ నియంత్రణ చికిత్స చేయాలని ఉత్తర్వులో వెల్లడించింది. లైసెన్సు గడువు ముగిసిన తరువాత పది రోజుల్లోగా తిరిగి లైసెన్సు పొందాలని ఆదేశాలలో పేర్కొంది.

కుక్కలు, పందుల పెంపకం దారులు లైసెన్సు తీసుకోవాలంటే ఆయా స్థానిక సంస్థలు నిర్ధేశించిన లైసెన్సు రుసుము చెల్లించాలి. లైసెన్సు పొందాలంటే ముందుగా కుక్కలు, పందుల యజమానులు వాటి హెల్త్ సర్టిఫికెట్ అందజేయాలని ఉత్తర్వులో స్పష్టం చేసింది. కుక్కలు, పందుల విషయంలో హెల్త్ సర్టిఫికెట్ ప్రభుత్వ పశువైద్యాధికారుల నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీల్లో కుక్కలు, పందుల యజమానులకు ఇకపై టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఆ టోకెన్ లను పెంపుడు జంతువుల మెడ చుట్టూ నిరంతరం వేలాడేలా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ డవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju