NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి మోడీ విశాఖ పర్యటన ఖరారు .. ఏర్పాట్లు పరిశీలించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు అంటే..?

PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపి పర్యటన ఖరారైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి లు ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు. ఆ రోజు రాత్రి ప్రధాని మోడీ విశాఖలోనే బస చేస్తారు. మరుసటి రోజు 12వ తేదీ ఉదయం ఆంధ్రా యూనివర్శిటీలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పలు పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

PM Modi

 

రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు, రూ.260 కోట్లతో చేపట్టిన వడ్లపూడి లో వ్యాగన్ వర్క్ షాపు, రూ.26వేల కోట్లతో చేపట్టిన హెచ్‌పీసీఎల్ నవీకరణ, విస్తరణ పనులు, రూ.445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పరిపాలనా భవనానికి ప్రధాని మోడీ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే విధంగా రూ.152 కోట్లతో చేపట్టనున్న చేపలరేవు నవీకరణ ప్రాజెక్టు, రూ.560 కోట్లతో కాన్వెంట్ కూడలి నుండి షీలానగర్ వరకు పోర్టు రహదారికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. కాగా ప్రధాని పర్యటనకు సంబంధించి విశాఖ నగరంలో ఏర్పాట్లను వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ తో కలిసి ఏయూ కాలేజీ గ్రౌండ్ ను పరిశీలించారు. ఈ సందర్భంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖలో ఏడు ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని తెలిపారు. ప్రధాని మోడీ, సీఎం వైఎస్ జగన్ తో కలిసి విశాఖలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు.

MP Vijaya sai Reddy

 

ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన పర్యటన కాదనీ, ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ దీన్ని క్లైమ్ చేసుకోదని అన్నారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే అన్ని రాజకీయ పార్టీలు స్వయంగా ఆహ్వానం పలుకుతారని దీన్ని రాజకీయం చేయవద్దని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12న ఉదయం కాలేజీ మైదానంలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. పీఎంవో, సీఎంవో అధికారులు చర్చించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ షెడ్యుల్ ను త్వరలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ రోజు ప్రధాన మంత్రి కార్యాలయం నుండి వచ్చిన సమాచారం ప్రకారం పీఎం మోడీ ఏడు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారని చెప్పారు. రైల్వే జోన్ ఇస్తామని గతంలో కేంద్ర రైల్వే మంత్రి ప్రకటించారనీ, అయితే ప్రధాని పర్యటనలో ఈ ప్రొగ్రామ్ కవర్ అవుతుందా లేదా అనేది త్వరలో తెలియజేస్తామన్నారు విజయసాయి రెడ్డి.

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ షాక్ .. విచారణకు హజరు కావాలంటూ నోటీసులు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?