Political Survey: టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో వైసీపీ హవా కొనసాగుతోంది. ఈ జిల్లాలో చంద్రబాబు కంటే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని అభిమానించే వారే ఎక్కువ అని గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల ఫలితాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో 2014, 2019 ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసీపీనే గెలుచుకుంది. ఇప్పుడు అదే డామినేషన్ కొనసాగుతోందని తాజా సర్వే లు తెలియజేస్తున్నాయి. టీడీపీ అనుకూల సర్వే సంస్థలు చెబుతున్న లెక్కల్లోనూ అదే తెలుస్తొంది.

చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2014 ఎన్నికల్లో వైసీపీ 8, టీడీపీ ఆరు స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా ఒకే ఒక సీటు అది కూడా కుప్పంలో చంద్రబాబు మాత్రమే గెలిచారు. మిగిలిన 13 స్థానాలు వైసీపీ కైవశం చేసుకున్నది. ఈ ఫలితాలను బట్టి చూస్తేనే జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏమిటో అర్ధం అవుతోంది. ఇక తాజాగా వచ్చిన సర్వేల్లోనూ చిత్తూరు జిల్లాలో వైసీపీ అధిక్యమేనని స్పష్టం చేసింది. రీసెంట్ గా ఓ సర్వే సంస్థ విడుదల చేసిన లెక్కల ప్రకారం జిల్లాలో 14 సీట్లు ఉండగా, వైసీపీ 8 స్థానాలు కైవశం చేసుకుంటుందనీ, టీడీపీ కాస్త మెరుగ్గా నాలుగు స్థానాలు మాత్రమే గెలుస్తుందని చెప్పింది. రెండు స్తానాల్లో నువ్వా నేనా అన్న పోటీ నెలకొని ఉంటుందని తెలిపింది.
పుంగనూరు, తంబళ్లపల్లి, చంద్రగిరి, పూతలపట్టు, సత్యవేడు, చిత్తూరు, తిరుపతి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలు వైసీపీ గెలుస్తుందనీ, కుప్పం, పలమనేరు, నగరి, మదనపల్లె నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పింది. ఇక పీలేరు, శ్రీకాళహస్తి 50:50 ఛాన్స్ అన్నట్లుగా పేర్కొంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి తిరుపతి, చిత్తూరు, పూతలపట్టు, తంబళ్లపల్లి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం లేదనీ, అందుకే ఆ నియోజకవర్గాల్లో వైసీపీ హవా కొనసాగుతోందని చెబుతున్నారు. ఇక తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని 2019 ఎన్నికల్లో వైసీపీ కైవశం చేసుకుంది. ఆ తర్వాత అక్కడి ఎంపీ అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్ధి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏది ఎలా ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకాలో సీఎం జగన్ హవా కొనసాగుతుండటం విశేషం.
YSRCP: వైసీపీలో భారీగా పదవుల పందేరం .. అనుబంధ విభాగాలకు 136 మంది జోనల్ ఇన్ చార్జిలు