Harirama Jogaiah Letter: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కాంకి సంబంధించి సోమవారం అసెంబ్లీ సమావేశాలలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా అర్థవంతమైన రీతిలో మొత్తం వివరాలన్నీ బయట పెట్టడం జరిగింది. దాదాపు ₹370 కోట్ల స్కామ్ జరిగిందని… చంద్రబాబు హయంలో మొత్తం తథాంగం నడిచిందని క్లియర్ కట్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో జగన్ వివరించడం జరిగింది. ఇదిలా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు చంద్రబాబుతో కలిసి పనిచేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నట్లు వార్తలు ఎప్పటి నుండో వస్తున్నా సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించి మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చిలనివ్వను.. ఇదే సమయంలో… వచ్చే ఎన్నికలలో టీడీపీతో జనసేన కలవకూడదు అని వైసిపి అనుకుంటున్నట్లు పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ ఏదైతే అనుకుంటుందో అది కచ్చితంగా… జరిగితీరుది అని.. పవన్ స్పష్టం చేశారు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు పరోక్షంగా పవన్ వ్యాఖ్యానించినట్లయింది. పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై… కాపు సంక్షేమ సేన ప్రెసిడెంట్ మాజీ ఎంపీ హరిరామ జోగయ్య… పవన్ ని ఇరుకున పెట్టే ప్రకటన చేయడం జరిగింది. ఆయన చేసిన ప్రకటన… “స్కిల్ డెవలప్మెంటు స్కాంపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన గందరగోళం సృష్టిస్తున్న మాట వాస్తవం. విద్యార్ధులు పేరుతో చంద్రబాబు అతి పెద్ద స్కాంకు పాల్పడ్డారని అసెంబ్లీ సాక్షిగా ఆరోపణ చేశారు.

370కోట్లు చంద్రబాబు, ఆయన మనుషులు తినేశారని చెబుతూ ఈ ఆరోపణకు మద్దతుగా అనేకసాక్ష్యాలను బహిర్గతం చేశారు. ఈ విమర్శ కేవలం రాజకీయ విమర్శ మాత్రమేనా లేక ఏమైనా నిజమంటూ ఉందా అనేది సి.ఐ.డి. దర్యాప్తులో తేలవలసి ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో చేసిన ఈ ఆరోపణలపై చంద్రబాబు తమ నిర్దోషిత్వాన్ని నిరూపణ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేనిచో రాబోయే ఎన్నికలలో తెలుగుదేశంతో కలిసి వెళ్ళవలసియున్న జనసేనపార్టీ డిఫెన్సులో పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఆరోపణలు నిరూపణ అయితే నీతివంతమైన పరిపాలన అందిస్తారని పవన్ కల్యాణ్ పై ఆశలు పెట్టుకున్న ప్రజానీకానికి సమాధానంగా తెలుగుదేశంపార్టీని ప్రక్కనపెట్టి ప్రయాణం చేయటం తప్ప జనసేనకు వేరే మార్గంలేదు” అని హరిరామ జోగయ్య ప్రకటన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచనలో ఉన్న పవన్ ని ఇరుకున పెట్టేసినట్లయింది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై హరిరామ జోగయ్య చేసిన తాజా ప్రకటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.