NewsOrbit
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

YS Jagan – Balineni Srinivasa Reddy: దుష్ట చతుష్టయం తో చెలిమి కారణంగానే వాసుకు జగన్ కు మధ్య దూరం పెరిగిందా?

Internal politics creating differences in Jagan party ysrcp

YS Jagan – Srinivasa Reddy:  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువైనప్పటికీ ప్రకాశం జిల్లా కు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుండడం ఆయన స్వయంకృతాప రాధాల పర్యవసానమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.2019 ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించిన జగన్ సీఎం కాగానే పర తొలి మంత్రివర్గంలో బాలినేని వాసుకు స్థానం కల్పించడమే కాకుండా కీలకమైన విద్యుత్,అటవీ శాఖలను కేటాయించారు. ప్రకాశం జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేష్ కి కూడా మంత్రి పదవి దక్కినప్పటికీ బాలినేని హవానే జిల్లాలో పూర్తిగా సాగింది.అయితే తదుపరి పరిణామాలలో వాసు అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు.

 

balineni srinivas facing issues
balineni srinivas facing issues

అవినీతి ఆరోపణలు అనేకం!

ఆయనకు సన్నిహితుడైన ఒక వ్యాపారి తమిళనాడు పోలీసులకు హవాలా సొమ్ముతో దొరికారు. ఒక మిత్రుడి ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు ఏకంగా చార్టెడ్ విమానం లో వాసు విదేశాలకు వెళ్లి రావటం మరో దుమారం రేపింది. ఇక ఒంగోలు,చీరాల పర్చూరు,అద్దంకి తదితర నియోజకవర్గాల్లో ఇసుక మాఫియా కు బాలినేనే బిగ్ బాస్ అన్న టాక్ జిల్లా మొత్తం వినిపిస్తోంది. అంతేగాక తనను విమర్శించాడన్న ఆగ్రహంతో ఒంగోలుకు చెందిన సుబ్బారావు గుప్తా అనే వ్యక్తిపై ఒక రౌడీషీటర్ తో బాలినేని దాడి చేయించాడని మీడియాలో ప్రముఖంగా వచ్చింది.సదరు సుబ్బారావు గుప్తా అయితే బాలినేనిని బంతా డుకుంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టింగులు పెడుతున్నాడు. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డిని ఒంగోలు దావూద్ గా కూడా సుబ్బారావు గుప్తా అభివర్ణించాడు.

ysrcp political issuesin 6 constituencys
ysrcp political issuesin 6 constituencys

ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ అతలాకుతలం!

ఇక రాజకీయ కోణంలో నుండి చూస్తే వాసు జిల్లాలోని కనీసం ఆరు నియోజకవర్గాల్లో వైసీపీని అస్థిరపరిచాడన్న విమర్శలు లేకపోలేదు. ఆయా నియోజకవర్గాల్లో తన స్వప్రయోజనాల కోసం, కొందరి పై పాత కక్షలు తీర్చుకోవడం కోసం అసలు సిసలు వైసీపీ నేతలను అడగదొక్కి వలస నాయకులను పార్టీలోకి తెచ్చి గందరగోళ పరిస్థితులను వాసు సృష్టించారన్నది నిర్వివాదంశం.

jyothi paper targeted ys jagan
jyothi paper targeted ys jagan

దుష్ట చతుష్టయంతో లింకులు?

మరోవైపు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ద్వేషించే తెలుగుదేశం పార్టీ నేతలతోటే కాకుండా సీఎం తరచూ చెప్పే దుష్ట చతుష్యంతోటి కూడా వాసుకు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం పార్టీ హైమాండ్ దృష్టికి వెళ్ళింది. జగన్ పై బురద చల్లడమే ధ్యేయంగా వార్తలు రాసే ఒక దినపత్రిక ‘జ్యోతి’ వెలగడానికి వాసు చమురు పోస్తున్నారనేది ప్రకాశం జిల్లాలో బహిరంగ రహస్యం. ఆ దినపత్రిక కు వాసు ప్రతినెల 5 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇస్తున్నట్లు కూడా ఒంగోలులోని మీడియా చెవులు కొరుక్కుంటుంది.

ys jagan secrets leak
ys jagan secrets leak

సీఎం సీక్రెట్స్ లీకేజీ?

తనను తప్పించి ఆదిమూలపు సురేష్ ను మాత్రమే మంత్రివర్గంలో కొనసాగించిన జగన్ పై కోపంతో వాసు సీఎంకు సంబంధించిన కొన్ని రహస్యాలను ఎల్లో మీడియాకు చేరవేసిన సమాచారం కూడా సీఎంఓలో ఉందని విశ్వసనీయ వర్గాల భోగట్టా.అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కూడా బాలినేని వాసు తెరచాటు రాజకీయం సాగిస్తున్నాడనే వార్తలు కూడా వినవస్తున్నాయి

ys jagan serious
ys jagan serious
అలవాట్లపైనా అధిష్టానం సీరియస్

ఇక వ్యక్తిగతంగా చూస్తే పేకాట ఆడడం, క్యాసినోలకు వెళ్లడం వంటి అలవాట్లు వాసుకు ఉన్నాయి.దాన్ని ఆయనే మీడియా సమావేశంలో సైతం ధ్రువీకరించారు.ఇది కూడా పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది.ఇది ప్రజలకు ఏ విధమైన సంకేతం ఇస్తుంది అన్న విషయంలో పార్టీ హై కమాండ్ ఆలోచనలో పడింది

people serious on balineni srinivas
people serious on balineni srinivas
తీవ్రస్థాయిలో ప్రబలిన ప్రజా వ్యతిరేకత!

ఇటీవల కాలంలో ఆయనపై ఒంగోలులో ప్రజా వ్యతిరేకత కూడా ప్రబలింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బాలినేనిను జనం నిలదీసిన ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో అన్ని విధాలా బాలేనేని వాసు గుదిబండలా తయారయ్యాడన్న నిర్ధారణకు వచ్చాకే జగన్ ఒక్కొక్కటిగా ఆయన రెక్కలు విరిచేస్తూ వస్తున్నాడని పార్టీ ఉన్నత స్థాయి వర్గాలే చెబుతున్నాయి.మంత్రి పదవి తీసేయడం, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించి స్థానభ్రంశం చేయడం వంటి జగన్ చర్యలు ఇందుకు నిదర్శనం అంటున్నారు. అంతేకాక భవిష్యత్తులో జగన్ బాలినేనికి బొమ్మ చూపుతారని కూడా వినవస్తోంది.

author avatar
Special Bureau

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!