Subscribe for notification

Shocking Revelations on YSRCP Ex Minister : వందల కోట్లు దోచి: టీడీపీకి వెళ్తానని బూచి: జగన్ నే ఏమార్చి.. మాజీ మంత్రి ఆగడాలు..!

Share

Shocking Revelations on YSRCP Ex Minister :  రాజకీయాలంటే కొన్ని విలువలుంటాయి.. ఎక్కడో ఒక దగ్గర కొన్ని సెంటిమెంటులుంటాయి.. అవినీతి చేసినా కొన్ని పరిమితులుంటాయి.. ఆగడాలకు కొన్ని హద్దులుంటాయి.. పార్టీ పట్ల, అధినేత పట్ల కొన్ని ఎమోషన్లు ఉంటాయి.. కానీ ఇవేమి లేకుండా కేవలం “హద్దుల్లేని అవినీతి చేసి.., అడ్డగోలుగా దోచేసి.. పార్టీకి చెడ్డపేరు వచ్చేలా అటవీ భూములను కాజేసి..

Follow on Google News

Special Bureau, NewsOrbit: Exclusive story on outrageous activities of Ex Minister from YS Jagan’s YSR Congress party revealed for the first time on NewsOrbit.

Shocking Revelations on YSRCP Ex Minister :  రాజకీయాలంటే కొన్ని విలువలుంటాయి.. ఎక్కడో ఒక దగ్గర కొన్ని సెంటిమెంటులుంటాయి.. అవినీతి చేసినా కొన్ని పరిమితులుంటాయి.. ఆగడాలకు కొన్ని హద్దులుంటాయి.. పార్టీ పట్ల, అధినేత పట్ల కొన్ని ఎమోషన్లు ఉంటాయి.. కానీ ఇవేమి లేకుండా కేవలం “హద్దుల్లేని అవినీతి చేసి.., అడ్డగోలుగా దోచేసి.. పార్టీకి చెడ్డపేరు వచ్చేలా అటవీ భూములను కాజేసి.., పార్టీ పెద్దలకు తెలిసి ఏమైనా అంటే ప్రత్యర్థి పార్టీకి వెల్లిపోతానని బెదిరించి.. ఏకంగా సీఎం జగన్ నే ఒక రకమైన బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ మాజీ మంత్రి ఆగడాలు అన్నీ ఇన్నీ కావు..

2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆకృత్యాలు, ఆగడాలు, అవినీతి తతంగాలు ఒక్కోటీ బయటకు వస్తుంటే సీఎం జగన్ సైతం నిర్ఘాంతపోయే పరిస్థితి ఉందట..! మంత్రి పదవి పోయిన తర్వాత సదరు నేత అసమ్మతి రాజేసి.. చాలా మంది ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లి.. అవసరమైతే టీడీపీలోకి వెళ్ళడానికి చర్చలు ఆరంభించి.., ఒకానొక దశలో సీఎం జగన్ ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నాలు చేసినప్పటి నుండి అతనిపై ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిగా దృష్టి పెట్టాయి.. ఇప్పుడిప్పుడే ఒక్కో తతంగం బయటపడుతున్నాయి.. ఆ నేత ఎవరు..? ఆ తతంగాలేమిటి..? దీనిపై ప్రభుత్వ వర్గాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి..? అనే వివరాలు ఈ కథనంలో..

YSRCP EX Minister blackmailing politics

Shocking Revelations on YSRCP Ex Minister :  ఆ అక్రమాలు ఒక్కోటీ బయటకు..!?

ఆ తాజా మాజీ మంత్రి సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు.. సీఎం జగన్ 70 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి అది రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక రాజకీయ భేరి ద్వారా చాటే ప్రయత్నం చేశారు. అంటే అన్ని సామాజికవర్గాలకు అణగారిన వర్గాలకు ఎక్కువగా తాను ప్రాధాన్యత ఇచ్చాను అన్న నమ్మకాన్ని కల్గించే ప్రయత్నం చేశారు.

Special Bureau, NewsOrbit: Exclusive story on outrageous activities of Ex Minister from YS Jagan’s YSR Congress party revealed for the first time on NewsOrbit.

Click me

కానీ సీఎంకు సన్నిహితుడైన ఈ తాజా మంత్రి తన సొంత జిల్లాలో చేసిన కొన్ని తప్పిదాల కారణంగా కొన్ని దురాగతాల కారణంగా జగన్ లక్ష్యానికి దెబ్బతినే పరిస్థితి వచ్చింది.  బంధువు కూడా.. కానీ పదవిని అడ్డు పెట్టుకుని బరితెగించారు.. జిల్లాలో టీడీపీ నేతలతో స్నేహం చేసారు.., వైసీపీలో విబేధాలు సృష్టించారు.., పార్టీ ఎదుగుదల కంటే తన ఎదుగుదలే ముఖ్యం అనుకుని చాటుమాటున అనేక తప్పులు చేశారు.. ఆయనకు మంత్రి పదవి నుండి పీకేసిన తర్వాత అందరి కంటే ఎక్కువగా ఆయనే అసమ్మతి రాజేశారు.

Shocking Revelations on YSRCP Ex Minister

ఒకరకంగా సీఎం జగన్ పై పార్టీలో తిరుగుబాటు తెచ్చేలా తెరచాటు విఫలయత్నాలు చేశారు.. ఇంతలా చేసిన మాజీని సీఎం కూడా ఊరికే ఎందుకు వదిలేస్తారు..!? నిఘా పెట్టారు.. తన దగ్గర ఉన్న వ్యవస్థల ద్వారా గత నెల రోజులుగా సదరు మాజీ కార్యకలాపాలు, గత మూడేళ్ళలో చేసిన తతంగాలన్నిటిపైనా నివేదికలు తెప్పించుకున్నారు.. చాలా అక్రమాలే సీఎం దృష్టికి వెళ్లాయి.. అందులో అన్నిటికంటే పెద్దది.. అటవీ భూములను కాజేసిన తీరు..

* ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మండలం సోమవరప్పుడు గ్రామంలో దాదాపు 125 ఎకరాల అటవీ భూమిని తన వాళ్ళ పేరిటకు బదలాయించారనేది ఒక పెద్ద ఆరోపణ. దీనిపై ప్రాధమికంగా ఆధారాలు కూడా పెద్దలకు చేరాయి. తన ముఖ్య అనుచరుడు రామకృష్ణతో సహా మరో ఆరుగురు పేరిట భూములు కొనుగోలు చేసి.. వాటిని అటవీశాఖకు అప్పగించి.. వాటి స్థానంలో అటవీ భూములను పొందినట్టు సీఎం కార్యాలయానికి పక్కా సమాచారం అందింది. ఈ భూముల్లో విలువైన గ్రానైట్ ఉందట.., ప్రస్తుతం గ్రానైట్ తవ్వకాల కోసం ఇది జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం..!

* బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు మండలం ఈస్ట్ కుందుర్రు గ్రామంలోని దాదాపు 375 ఎకరాల అటవీ భూమిని కూడా తన బంధువుల, సన్నిహితుల పేరిటకు మళ్లించినట్టు మరో ఆరోపణ.. ఇది ప్రస్తుతం గనుల తవ్వకం అనుమతుల కోసం రాష్ట్ర భూగర్భ గనుల శాఖ దగ్గర పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం. దీన్ని సీఎం కార్యాలయం తెలుసుకుని.. ఫైల్స్ ఆపించేశారని అంతర్గతంగా తెలిసింది.

* ఈ భూముల్లో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏటా రూ. 500 కోట్లు వరకు ఆర్జించవచ్చని.. కొన్ని తరాలు సెటిల్ అయినట్టేనని సదరు మాజీ మంత్రి ఇంత రిస్క్ చేసారని చెప్పుకుంటున్నారు. అయితే సీఎం జగన్ కి తెలియకుండా దాదాపు 90% అక్రమ పనిని పూర్తి చేసినప్పటికీ.. ఇటీవల మొత్తం విషయం పెద్దలకు చేరడంతో అన్నీ ఎక్కడివక్కడే ఆపేశారని సమాచారం. ఈ మొత్తం 500 ఎకరాల్లో అన్ని దశలు దాటడానికి భారీగానే ఖర్చు చేసినట్టు సమాచారం.. దీంతో పాటూ..

* అద్దంకి నియోజకవార్గం బల్లికురవ మండలం చిన్నమల్లవరంలో కూడా ఎస్టీ లు నివాసముండే ప్రాంతంలో దాదాపు 11 ఎకరాల్లో విలువైన బ్లాక్ గ్రానైట్ ఉందని తెలియడంతో వాళ్ళను ఖాళీ చేయించారు. అక్కడ గతంలోనే ఎమ్మెల్యే సగం పని పూర్తి చేసి.. చివర్లో చెడ్డపేరు వస్తుందనే భయంతో ఆపేసారు.. కానీ ఇటీవల సదరు మాజీ మంత్రి, అక్కడి వైసీపీ నేతతో కలిసి ఈ పనిని పూర్తి చేశారని.. గ్రానైట్ తవ్వకాల కోసం అన్ని ఏర్పాట్లు చేసారని సమాచారం. దీన్ని ఖాళీ చేయించి, పూర్తిగా సిద్ధం చేయడానికి రూ. 8 కోట్లు వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.

(ఈ మాజీ మంత్రి ఆగడాలు, అక్రమాల జాబితాలు.. పార్టీ పెద్దల దృష్టిలో ఉన్న వ్యవహారాలు అన్నిటినీ తర్వాత కథనంలో తెలుసుకుందాం..)

Follow us on Google News and enable notifications to receive updates on this story and more political news from the states of Andhra Pradesh and Telangana

Follow on Google News

Share
Special Bureau

Recent Posts

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

54 mins ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

3 hours ago

Upasana: పిల్లల విషయంలో రామ్ చరణ్ భార్య వేసిన ప్రశ్నకు సద్గురు సంచలన సమాధానం..!!

Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…

3 hours ago

Bimbisara: ‘బింబిసార’ తాత గారికి అంకితం కళ్యాణ్ రామ్ సంచలన కామెంట్స్..!!

Bimbisara: నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Kalyan Ram) 'బింబిసార'(Bimbisara) ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బింబిసార' సినిమా…

3 hours ago

Pavitra Lokesh: పోలీస్ కంప్లైంట్ చేసిన పవిత్ర లోకేష్..!!

Pavitra Lokesh: గత కొద్ది రోజుల నుండి నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) లకి సంబంధించి వార్తలు మీడియాలో సోషల్…

3 hours ago

RC15: బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆధ్వర్యంలో 400 మంది డ్యాన్సర్ లతో చరణ్..స్టెప్స్..??

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charantej) తండ్రికి తగ్గ తనయుడు అన్న తరహాలో ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.…

4 hours ago