గోదావరి జిల్లాలో కాపు రాజకీయం కాక రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇది మరింత ముదిరింది. మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా సాగుతోంది. పవన్ కళ్యాణ్ కు ముద్రగడ బహిరంగ లేఖ విడుదల చేయడంతో పవన్ అభిమానులు ఆయన మాటల యుద్దం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ చేసిన వ్యాఖ్యలతో పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో హర్ట్ అయిన ముద్రగడ మరో లేఖను సంధిస్తూ పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ పై పిఠాపురంలో పోటీ చేసేందుకు సైతం సిద్దంగా ఉన్నానంటూ కూడా ముద్రగడ సవాల్ విసిరారు. ఓ పక్క ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ లా వివాదం సాగుతున్న తరుణంలో సినీ రంగానికి చెందిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటుడు పోసాని కృష్ణమురళిలు కూడా స్పందిస్తూ పవన్ పై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించినప్పటి నుండి ఓ పక్క వైసీపీ నేతలు ఆయనను చంద్రబాబు ప్యాకేజీ కోసం పని చేస్తున్నారంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.

పవన్ భాష తీవ్ర అభ్యంతరకరం
వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న భాషపై రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) కామెంట్స్ చేశారు. ఏపీలో రాజకీయ ప్రచారాలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు ఆర్జీవీ. తాను అనుకున్న విషయాన్ని ఎవరు వ్యతిరేకించినా.. అధికారంలోకి వస్తే పీక పిసికేసి చంపేస్తా, బట్టలూడదీసి పరుగెత్తిస్తా, చర్మం వలిచేస్తా వంటి హింసాత్మకమైన బెదిరింపులాంటి వ్యాఖ్యలు, ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో.. హిట్లర్, సద్దాం హుస్సేన్ సహా ఎవరూ అనరని అన్నారు. తానుత అదికారంలోకి వస్తే నరికేస్తాను అంటే .. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అది చేయొచ్చు అని చెప్పడమా అన్నారు ఆర్జీవీ. ఏది ఏమైనా ఒక ప్రజాస్వామ్య దేశంలో తన అనుచరులు, అభిమానులకు నేరుగా ఇంత దారుణమైన, హింస ను ప్రేరేపించేలా మాట్లాడి రెచ్చగొట్టడం తీవ్రవాదం కన్నా ప్రమాదకమైన ఆటవిక మనస్తత్వం అని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి హింసని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటే .. ఆ సమావేశాలకు వచ్చే ఆ యువకులు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారో ఆ పవన్ కళ్యాణ్ కే తెలియాలి అని అన్నారు. ఈ హింసను ప్రోత్సహించేలా బెదిరింపుల లైవ్ వీడియోను పిల్లలతో కలిసి పెద్దలు టీవీ ముందు కూర్చుని చూస్తారన్న సంగతి మర్చిపోకూడదు అంటూ ట్వీట్ చేశారు.
ముద్రగడకు పవన్ క్షమాపణలు చెప్పాలి
ముద్రగడకు మద్దతుగా పోసాని కృష్ణమురళి స్పందిస్తూ .. ముగ్రగడ పద్మనాభం గొప్ప నాయకుడని, ఆయన ఏనాడూ రాజకీయంగా, ఆర్ధికంగా లబ్దిపొందలేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వల్లే కాపుల్లో చిచ్చు రేగిందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కాపులను తిట్టి చంద్రబాబును పొగడటం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్టర్ లోనే పవన్ నడుస్తున్నారని ఆరోపించారు. పవన్ ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేదో తెలియదని అన్నారు. పవన్ కన్నా ముద్రగడ గొప్ప నాయకుడు అని కొనిడాయారు. ముద్రగడకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వంగవీటి మోహనరంగాను చంద్రబాబే చంపించాడన్న విషయం ఆంధ్రా మొత్తం తెలుసని, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి చంద్రబాబే కారణమన్న విషయం కూడా జగమెరిగిన సత్యమన్నారు. ఇదంతా తెలిసి కూడా చంద్రబాబుకు వంతపాడటం ఏమిటని పోసాని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ కు మరో లేఖ సంధించిన ముద్రగడ .. ఈ సారి మరింత ఘాటుగా..