NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Power Shock: 21 కోట్లు కరెంటు బిల్లు..! ఈ కరెంటు బిల్లు చూస్తే ఎవరికైనా గుండె ఆగుతుంది..!!

Power Shock: సాధారణంగా ఎవరికైనా కరెంట్‌ సరఫరా అయ్యే తీగను లేదా వైరును పట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారుల లీలల కారణంగా విద్యుత్ బిల్లును పట్టుకున్నా షాక్ కొట్టి గిలగిలా కొట్టుకుని కింద పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గుండె జబ్బులు ఉన్న వాళ్లకు ఈ కరెంటు బిల్లు ఇస్తే గుండె ఆగిపోవడం ఖాయం.  అసలే ఈ నెల నుండి ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ బిల్లుల బాదుడు స్టార్ట్ అవుతోందని విద్యుత్ వినియోగదారులు ఓ పక్క ఆందోళన చెందుతుండగా, మరో పక్క తప్పుడు మీటర్లు (సాంకేతికలోపం)తో వేలు, లక్షల్లో బిల్లులు రావడం మరింత ఆందోళన కల్గిస్తోంది. ఓ సాధారణ కాకా హోటల్ యజమానికి వేలు కాదు, లక్షలు కాదు కోట్ల రూపాయల మేర కరెంట్ బిల్లు రావడంతో అతను బెంబేలెత్తిపోయాడు.

power shock: huge current bill for a small hotel in chinthalapudi west godavari district
power shock huge current bill for a small hotel in chinthalapudi west Godavari district

వివరాల్లోకి వెళితే..పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ చిన్న హోటల్ కు ఈ నెలలో రూ.21,48,62,224ల విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసి హోటల్ నిర్వహకుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. చిన్న హోటల్ కు అంతా బిల్లా అంటూ చూసిన వారు అవాక్కయ్యారు. గత నెలలోనూ ఈ హోటల్ కు రూ.47,148ల కరెంటు బిల్లు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన సదరు హోటల్ నిర్వహకుడు కరెంటు ఆఫీసుకు పరుగులు పెట్టాడు. ప్రతి నెలా తన హోటల్ కు రూ.600 నుండి రూ.700లు మాత్రమే బిల్లు వస్తుందని, ఒకే సారి ఇంత మొత్తంలో బిల్లు వస్తే తాను ఏలా కట్టగలనంటూ అధికారులకు విన్నవించగా, అధికారులు పరిశీలన చేసి కరెంటు మీటరులో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించి కొత్త మీటరు బిగించారు.

కొత్త మీటరు బిగించిన తరువాత కూడా గతంలో వేలల్లో వచ్చిన బిల్లు ఇప్పుడు 21 కోట్లకు పైగా రావడంతో హోటల్ యజమాని తీవ్ర ఆందోళనకు గురైయ్యాడు. ఇలా ప్రతి నెలా లక్షలు, కోట్ల రూపాయల మేర కరెంటు బిల్లు రావడం ఆందోళనకు గురి చేస్తున్నదని హోటల్ యజమానికి వాపోతున్నాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ఈ బిల్లు విషయంపై చింతలపూడి మండల విద్యుత్ శాఖ ఏఇ శంకర్ దృష్టికి మీడియా తీసుకువెళ్లగా సాంకేతిక లోపం కారణంగా అంత బిల్లు వచ్చిందనీ, దానిని సరి చేస్తామని తెలియజేశారు.

Read More:

1.YS Sharmila: ఎంఆర్‌పీఎస్ నేత మంద కృష్ణమాదిగతో వైఎస్ షర్మిల భేటీ..! రెండు కారణాలు..!!

2.Vinayaka Chaviti Celebrations: గణేష్ ఉత్సవాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..! కండిషన్స్ అప్లై..!!

3.AP Govt: జీవోల బహిర్గతంపై నిర్ణయాన్ని మార్చుకున్న ఏపి సర్కార్..! ఆ సైట్ లో చూడవచ్చు..!!

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju