Subscribe for notification

సింగరాయకొండలో జరిగింది ఇదే..! ప్రకాశం పోలీసుల స్పందన..!!

Share

 

ప్రకాశం Prakasam జిల్లా సింగరాయకొండ Singarayakonda శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వాగత ద్వారంపై ఉన్న మూడు విగ్రహాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల విజయనగరం Vijayanagaram జిల్లా రామతీర్ధంలో కోదండ రాముడి విగ్రహానికి ఆ తరువాత కృష్ణా జిల్లా విజయవాడ Vijayawada లో సీతమ్మ విగ్రహాలకు అపచారం జరిగిన నేపథ్యంలో సింగరాయకొండలో ఆలయ స్వాగత ద్వారంపై ఉన్న మూడు విగ్రహాలు దెబ్బతినడంతో ఇది కూడా ఎవరో చేసి ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.  దీనిపై వెంటనే ప్రకాశం జిల్లా   జిల్లా అడిషనర్ ఎస్‌పీ (అడ్మిన్) బి రవిచంద్ర స్పందించారు.

తుప్పుపట్టే విగ్రహం చేతులు విరిగి పడ్డాయి

శ్రీకృష్ణదేవరాయల కాలంలో సింగరాయకొండలో శ్రీ లక్ష్మీ నర్శింహస్వామి ఆలయం నిర్మించారని అడిషనల్ ఎస్పీ రవిచంద్ర పేర్కొన్నారు. ఆ ఆలయానికి అనుసంధానంగా పట్టణంలో రెండు కిలో మీటర్ల దూరంలో సుమారు 20 సంవత్సరాల క్రితం సిమెంట్ తో స్వాగత ద్వారం నిర్మించారని దానిపై లక్ష్మీనర్శింహస్వామి,  రాజ్యలక్ష్మి అమ్మవారు, గరుత్మంతుడు విగ్రహాలు ఏర్పాటు చేశారు. రెండు దశాబ్దాలుగా  ఆ విగ్రహాలు ఎండకు ఎండి, వానకు తడవటం వల్ల తప్పు పట్టాయి. ఈ క్రమంలో ఆ విగ్రహాల చేతులకు తుప్పు పట్టడం వల్ల విరిగి కింద పడిపోయాయని అడిషనల్ ఎస్ పి రవిచంద్ర తెలిపారు.

ఈ ఏడాది మరమత్తులు చేయలేదు

ప్రతి సంవత్సరం ఈ స్వాగత ద్వారానికి దాతల సహకారంతో ఆలయ అధికారులు మరమ్మత్తులు చేయడం జరుగుతోంది.  కానీ ఈ ఏడాది కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించకపోవడంతో స్వాగత ద్వారం మరమ్మత్తులు కూడా చేయలేదని ఆయన చెప్పారు. స్వాగత ద్వారంపై ఉన్న దేవుడి విగ్రహాలకు తుప్పు పట్టడం వల్లనే చేతులు విరిగి కిందపడ్డాయని ఆలయ ఇఓ బైరాగి తెలియజేశారన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి నిజాలు తెలియకుండా అవాస్తవాలు ప్రచారం చేసి శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి వదంతులు నమ్మవద్దని అడిషనల్ ఎస్పీ సూచించారు.


Share
somaraju sharma

Recent Posts

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

27 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

58 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

1 hour ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

3 hours ago