NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పండుగకు కౌంట్ డౌన్ షురూ అయింది. గత రెండు నెలలుగా ఏపీ లో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేశాయి. అయితే రెండు నెలల పాటు కష్టపడ్డ పార్టీల ప్రతిఫలం.. సోమవారం ఒక్క రోజుతో తేలిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఏపీ రాజకీయాలలో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2019 ఎన్నికల్లో వైసిపి పార్టీకి ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే 151 అసెంబ్లీ స్థానాలను వైసీపీ పార్టీ దక్కించుకుంది. వైసిపి పార్టీ ఆ రేంజ్ లో స్థానాలు దక్కించుకోవడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర కచ్చితంగా ఉంది. ఆయన ఇచ్చిన ఆలోచనలను జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా అమలు చేయడంతో ఆ ఫలితం వచ్చింది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో… జగన్మోహన్ రెడ్డి మరియు ప్రశాంత్ కిషోర్ విడిపోయారు.

ఈసారి ప్రశాంత్ కిషోర్ లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లారు. వీరి మధ్య గొడవలు జరిగిన నేపథ్యంలో… జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల కంటే ఒక్కరోజు ముందుగానే వైసిపి పార్టీ భవిష్యత్తును తేల్చి చెప్పారు ప్రశాంత్ కిషోర్. గ్రౌండ్ స్థాయిలో వైసీపీ పార్టీకి అసలు బాగాలేదని… జగన్మోహన్ రెడ్డి పై జనాలు చాలా కోపంగా ఉన్నారని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అలాగే ఏపీలో గత ఎన్నికల్లో 151 స్థానాలు దక్కించుకున్న వైసిపి పార్టీ ఈసారి 51 స్థానాలకే పరిమితo అవుతుందని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఎంపీ సీట్లు కూడా 8 గెలిచే ఛాన్స్ ఉన్నదని బా0బు పేల్చారు. అటు 120కి పైగా అసెంబ్లీ సీట్లు దక్కించుకొని కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా ప్రస్తుత ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యాడని బాంబు పేల్చారు ప్రశాంత్ కిషోర్. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైసిపి పార్టీని గందరగోళంలోకి నెట్టాయి.

ఎన్నికల కంటే ముందే… వైసీపీని దెబ్బ కొట్టేందుకు ఇలా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నారని వైసీపీ మండిపడుతోంది. ఏది ఏమైనా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన ప్రశాంత్ కిషోర్… 2024 ఎన్నికల గురించి చెప్పిన లెక్కలు… నిజమవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల కంటే ముందే ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయడం కూడా… వైసిపి పార్టీకి తీవ్రమైన దెబ్బ తాకడం ఖాయం అంటున్నారు.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N