Kurnool: ఖరీఫ్ సీజన్ లో రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో వజ్రాల వేట జరుగుతుంది. వజ్రకరూర్ తదితర ప్రాంతాల్లో వజ్రాల కోసం అన్వేషణ చేస్తుంటారు. కొందరు రైతులకు వజ్రం దొరికి వారి ఇంట పంట పండిస్తొంది. రీసెంట్ గా తుగ్గలి మండలం బసనేపల్లికి చెందిన రైతుకు ఓ వజ్రం దొరకింది. దానిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. ఈ వజ్రాన్ని గుత్తికి చెందిన ఓ వ్యాపారి రూ.2కోట్లకు దక్కించుకున్నట్లుగా సమాచారం. ప్రతి ఏటా తొలకరి పలకరింపు సమయంలో రైతులు, ఇతరులు వజ్రాల కోసం వెతుకులాట సాగిస్తుంటారు. వారిలో కొందరికి మాత్రమే అదృష్టం వరిస్తుంటుంది.

కొందరు తమ పనులు మానుకుని మరీ పొలాల్లో వెతుకులాట సాగిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. బసనేపల్లి రైతుకు వజ్రం దొరికిన విషయం తెలుసుకున్న వజ్రాల వ్యాపారులు అది విలువైంది అని తెలుసుకుని పోటీ పడ్డారు. దీంతో రైతు వేలం వేయగా భారీ ధర పెట్టేందుకు గుత్తికి చెందిన వ్యాపారి ముందుకు వచ్చారు. రూ.2 కోట్లు పెట్టి ఆ వజ్రం దక్కించుకున్నాడు. ఇంత విలువైన వజ్రం దొరకడం ఈ సీజన్ ఏదో మొదటిదని అంటున్నారు. ఇంతకు ముందు ఓ సారి రూ.2 లక్షలు, రూ.3లక్షలు విలువైన వజ్రాలు దొరికాయనీ, గరిష్టంగా రూ.20 లక్షలు విలువ చేసే వజ్రం దొరికిన సందర్భాలు ఉన్నాయనీ, కానీ రూ.2 కోట్లు ధర లభించడం ఇదే ప్రధమమని అంటున్నారు. ఒక్క వజ్రంతో ఆ రైతు కోటీశ్వరుడు అయిపోయారు.
AP CID: మార్గదర్శి కేసులో శైలజా కిరణ్ ను మరో సారి విచారిస్తున్న ఏపీ సీఐడీ