Premium Brand Liquor: బ్రేకింగ్.. మందు బాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక ఎగిరిగంతెయ్యడమే..

Share

Premium Brand Liquor: ఏపిలో మందు బాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన మద్యం పాలసీలో భారీ మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపులను నిర్వహిస్తోంది. అయితే తొలుత దశల వారీ మధ్య నిషేదంలో భాగంగా ఏడాదికి కొన్ని షాపులను తగ్గించడంతో పాటు మద్యం ధరలను సామాన్యులకు భారంగా ఉండేలా పెంచేసింది. ధరలు పెంచడం వల్ల మద్యం సేవించేవారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం అప్పుడు భావించింది. అయితే మధ్యం షాపుల్లో గతంలో ప్రీమియం బ్రాండ్ మద్యం విక్రయాలు జరిగేవి. ప్రభుత్వం మద్యం షాపుల నిర్వహణ ప్రారంభించిన తరువాత వివిధ రాష్ట్రాల్లో ఎక్కడా లేని కొత్త కొత్త బ్రాండ్ ల మద్యం విక్రయాలు చేపట్టారు. దీనిపై పలు మార్లు ప్రతిపక్ష పార్టీలు నాశిరకం మద్యం అమ్మకాలు చేస్తున్నారంటూ విమర్శలు సైతం చేశారు. మరో పక్క మందు బాబులకు అవసరమైన బ్రాండ్ లు రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం షాపుల్లో దొరకకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు మద్యం రేట్లు 20 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. అదే విధంగా రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది.

Premium Brand Liquor: అందుబాటులోకి ప్రీమియం బ్రాండ్ల మద్యం

పది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఈ రోజు నుండి రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఏపి బేవరేజెస్ కార్పోరేషన్ కు చెందిన రిటైల్ ఔట్ లెట్లతో విక్రయించనున్నట్లు తెలిపింది. బార్లు, వాక్ ఇన్ స్టోర్లలో ప్రీమియం బ్రాండ్లు విక్రయించాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మందు బాబులు పండుగ చేసుకుంటున్నారు. న్యూఇయర్ గిఫ్ట్ అంటే అని ఇదేనంటూ ఎగిరిగంతేస్తున్నారు. మరి కొద్ది గంటల్లో పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి నూతన సంవత్సరానికి వెల్ కమ్ చెప్పే వేడుకలకు టాక్స్ పేయర్స్ (మందుబాబులు) సిద్దం అవుతున్నారు.


Share

Related posts

ఆ రహస్యం.. కరోనాను ఆవిరి చేస్తుంది..!!

sekhar

Liger: ‘లైగర్‌’తో పూరి ఆ మ్యాజిక్ రిపీట్ చేయగలడా..?

GRK

టాస్‌తో విజయం

Siva Prasad