ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ప్రియురాలిని చంపిన ప్రేమోన్మాది డిల్లీబాబు ఆత్మహత్య

Share

చిత్తూరు జిల్లాలో ప్రేమించిన యువతిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది డిల్లీబాబు (19) ఆత్మహత్య చేసుకుని తనువుచాలిండారు. పెనుమూరు మండలం తుర్పుపల్లి అడవిలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు.

Premonmadi Dillibabu commits suicide

 

వివరాల్లోకి వెళితే..చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన జి గాయత్రి (20), పూతలపట్టు మండలం చింతమాకులపల్లే గ్రామానికి చెందిన డిల్లీ బాబులు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో వివాహానికి పెద్దలు అంగీకరించరని గత నెల రెండవ వారంలో పెద్దలకు చెప్పకుండా తిరుపతికి వెళ్లి రహస్యంగా  వివాహం చేసుకున్నారు. అయితే గాయత్రి ఇంట్లో వారికి చెప్పకుండా వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు పెనుమూరు  పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారి ఆచూకి గుర్తించి పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో గాయత్రి తల్లిదండ్రుల వద్దే ఉంటానని చెప్పడంతో ఆమెను పోలీసులు పేరెంట్స్ కు అప్పగించారు.

Premonmadi Dillibabu commits suicide

అయితే తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి తన వద్దకు రాకుండా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఢిల్లీ బాబు ఆమెపై ధ్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుని నిన్న గాయత్రి  తన బంధువుల అమ్మాయితో కలిసి బైక్ పై ఇంటికి వెళుతుండగా ఎంపరాల కొత్తూరు వద్ద దారి కాచి అడ్డుకున్నాడు. తీవ్ర ఆగ్రహంతో గాయత్రిపై కత్తితో విచక్షణారహితంగా గాయపరిచి పరారైయ్యాడు. తీవ్రంగా గాయపడిన గాయత్రిని కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో తమిళనాడు లోని వేలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఢిల్లీ బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ రోజు మధ్యాహ్నం తూర్పుపల్లి అడవిలో ఒక చెట్టుకు డిల్లీ బాబు ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని చూసిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డిల్లీ బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.


Share

Related posts

బాబు చేసింది జ‌గ‌న్ చేయ‌లేక‌పోయాడు.. .అందుకే ఇలా….

sridhar

Karthika Deepam : మందు తాగి రచ్చ రచ్చ చేసిన వంటలక్క… దీపలో మరో కోణాన్ని చూసి షాక్ లో కార్తీక్..!

Ram

డిస్నీలాండ్ లో తొక్కిసలాట

Kamesh
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar