NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Prision: వయసు 25 ఏళ్లే కానీ.. వీడు మామూలోడు కాదు..!!

Prision: నేరాల్లో పిహెచ్‌డీ డిగ్రీ అనేది ఇచ్చేది ఉంటే అది ఇతనికి ఇవ్వాల్సిందే. వయసు 25 ఏళ్లే కానీ అతను చేసిన నేరాల చిట్టా చాలా పెద్దది. 28 సార్లు వివిధ నేరాల్లో అరెస్టు అయి రికార్డు సృష్టించాడు.  తాజాగా నెల్లూరు జిల్లా రావూరు పోలీసులు ఇతన్ని మరో సారి అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 11 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Prision nellore dist
Prision nellore dist

విషయంలోకి వెళితే…కులవాయి మండలం వెరుబొట్లపల్లికి చెందిన గోగుల శివయ్య 16 ఏళ్ల వయస్సులోనే వ్యసనాలకు బానిస అయ్యాడు. విలాస జీవితం గడపాలన్న మోజుతో ఆ వయస్సులోనే ఓ దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే అనుభవం లేకపోవడంతో వెంటనే పోలీసులకు చిక్కాడు. వారు అతన్ని తిరుపతి జువైనల్ హోమ్ కు తరలించారు. ఆ తరువాత అక్కడ నుండి విడుదల అయి బయటకు వచ్చిన తరువాత తీరు మార్చుకోలేదు. రాత్రి సమయంలో వాహనంపై తిరుగుతూ తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. జిల్లా వ్యాప్తంగా నేరాలకు పాల్పడ్డాడు. దాదాపు 28 నేరాల్లో అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ క్రమంలో అతనిపై కలువాయి పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ కూడా తెరిచారు.

ఇటీవల జిల్లా వ్యాప్తంగా జరిగిన వరుస దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన వెంకటగిరి ఇన్స్‌పెక్టర్ ఎన్ నాగమల్లేశ్వరరావు..ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి  శివయ్యను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రావూరు. డక్కిలి, చేజర్ల, మునుబోలు, సంగం పోలీస్ స్టేషన్ ల పరిధిలో నమోదైన 8 కేసులకు సంబంధించి రూ. 11 లక్షల విలువైన బంగారు అభరణాలను, 40వేల నగదును, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ యువకుడి నేరాల చిట్టాను జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. తప్పించుకుని తిరుగుతూ వరుస నేరాలకు పాల్పడుతున్న శివయ్యను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N

Sneha: ప్ర‌స‌న్న కంటా ముందే నిర్మాతతో స్నేహ ప్రేమాయ‌ణం..నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లెందుకు క్యాన్సిల్ అయింది..?

kavya N

Rakul Preet Singh: ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ర‌కుల్.. ఇంత‌కీ ఆమె స్టార్ట్‌ చేయ‌బోయే రెస్టారెంట్ పేరేంటంటే?

kavya N

YSRCP: కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి బిగ్ షాక్ .. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

చిల‌క‌లూరిపేటలో సైకిల్ ప‌రుగులు.. వైసీపీ కావ‌టి ప్ర‌చారం ప‌దిమందికి త‌క్కువ.. ఐదుగురికి ఎక్కువా..?

ఉండిలో ఆర్ – ఆర్ – ఆర్ ముచ్చ‌ట‌.. చివ‌ర‌కు తేలేదేంటి..?

బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తున్నా చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు.. అందుకే జ‌గ‌న్ ది గ్రేట్‌..?

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .. 78 శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు తెలుసుకోవడం ఇలా..

sharma somaraju

Pushpa 2: పుష్ప 2లో ఒక్క జాత‌ర‌ సీన్ కే ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా.. మ‌రో 5 సినిమాలు తీయొచ్చు!

kavya N