NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వివేకా హత్య కేసులో ఆ ఆరుగురిని సీబీఐ విచారించాలి .. కోర్టులో శివశంకర్ రెడ్డి భర్య తులశమ్మ వాంగ్మూలం

వివేకా హత్య కేసులో దర్యాప్తును ఓ పక్క సీబీఐ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరో పక్క ఈ కేసులో నిందితుడుగా సీబీఐ అరెస్టు చేసిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ తొమ్మిది నెలల క్రితం వివేకా కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు చేస్తూ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై పులివెందుల కోర్టులో తులశమ్మ వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ పలు అంశాలను పరిగణలోకి తీసుకోలేదని తులశమ్మ ఆరోపించారు. మరో ఆరుగురుని సీబీఐ విచారించాలని సీబీఐని తులశమ్మ కోరారు. వివేకా హత్య కేసులో ఆర్ధిక అంశాలు, కుటుంబ వివాదాలు ముడిపడి ఉన్నాయనీ, ఆ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆమె కోరారు.

YS Vivekananda Reddy

 

వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి, బావమరిది శివప్రసాద్ రెడ్డి, పరమేశ్వరరెడ్డి, బీటెక్ రవి, రాజశేఖరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్ లను విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని తులశమ్మ కోరారు. తులశమ్మ గత ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తొమ్మిది నెలల తర్వాత వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో విచారణలో భాగంగా పులివెందుల కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం దేవిరెడ్డి శివశంకరరెడ్డి కడప జైలులోనే ఉన్నారు.

2019 ఎన్నికలకు ముందు పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. ఈ కేసు దర్యాప్తునకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ పాత సిట్ ను రద్దు చేసి వేరే సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో అసలైన దోషులను పట్టుకోవడంలో జాప్యం జరగడంతో వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టి ఈ కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా భావిస్తున్న నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో వివేకా డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.

Devireddy Sivasankar Reddy Wife Tulasamma

author avatar
sharma somaraju Content Editor

Related posts

Sindhu Menon: చంద‌మామ న‌టి సింధు మీనన్ ఏమైపోయింది.. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే యాక్టింగ్ ఎందుకు మానేసింది..?

kavya N

CAA: సీఏఏ పై సుప్రీం కోర్టులో విచారణ   

sharma somaraju

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju