21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కడప టీడీపీలో షాకింగ్ డెసిషన్: పులివెందుల అభ్యర్ధిని మార్చాలా..!?

Share

కడప జిల్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒ కీలకమైన సున్నితమైన అంశం ఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మీద టీడీపీ ఎటువంటి అభ్యర్ధిని పోటీకి నిలపాలి..? పులివెందుల్లో రాజకీయాలు ఏ విధంగా జరగాలి..? కుప్పంలో చంద్రబాబు మీద పోటీగా వైసీపీ పెడుతున్న అభ్యర్ధికి, పులివెందుల్లో జగన్మోహనరెడ్డికి పోటీగా టీడీపీ పెడుతున్న అభ్యర్ధికి ఉన్న గ్యాప్స్ ఏమిటీ..? పులివెందుల్లో టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఎలా ఉంది..? బీటెక్ రవి ..జగన్మోహనరెడ్డికి పోటీ ఇవ్వగలారా..? లేదా..అసలు పులివెందుల్లో టీడీపీ క్యాడర్ యే బీటెక్ రవి కాకుండా వేరే ఎవరైనా అయితే బాగుంటుంది అని ఎందుకు అనుకుంటున్నారు. అనే విషయాలను ఒక సారి పరిశీలిస్తే..

Kadapa TDP

 

క్రాస్ ఓటింగ్ తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం

వాస్తవానికి బీటెక్ రవి టీడీపీలో మంచి నాయకుడుగా చెబుతుంటారు. విద్యావంతుడు. మాస్ ఇమేజ్ ఉంది. ఆ జిల్లాలో అందరికీ తెలిసిన నాయకుడు. ఆర్ధికపరంగా స్థోమత ఉన్న నేత. ఇవి ఆయనలోని పాజిటివ్ లక్షణాలు. అందుకే జగన్మోహన రెడ్డికి పోటీగా ఆయన అయితే బాగుంటుంది అని టీడీపీ ఇన్ చార్జి గా పెట్టింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే..? 2017 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి 34 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ విషయం అందరికీ తెలుసు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 841 ఓట్లు ఉండగా, 839 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిలో ఏడు ఓట్లు చెల్లలేదు. బీటెక్ రవికి 433 ఓట్లు, వైఎస్ వివేకానందరెడ్డికి 399 ఓట్లు వచ్చాయి. అంటే బిటెక్ రవి 34 ఓట్ల తేడాతో వైఎస్ వివేకానందరెడ్డిపై గెలిచారు. వైఎస్ వివేకానంద రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ కడప జిల్లాలో వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులే ఎక్కువ. ఎంపీటీసీ, జడ్పీటీసీ పార్టీ సింబల్స్ (గుర్తులు)తో జరుగుతాయి. సర్పంచ్ ఎన్నికలు పార్టీ సింబల్స్ తో జరగవు. 2014 లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కడప లో మెజార్టీ స్థానాలు వైసీపీనే గెలుచుకుంది అన్నది అందరికీ తెలుసు. ఆ జిల్లాలో వైసీపీకి ఉన్న స్థానిక సంస్థల బలం ప్రకారం ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన వైఎస్ వివేకానంద రెడ్డే గెలవాలి. అయితే ఆనాడు టీడీపీ అధికారంలోకి ఉండటం, పవర్ పాలిటిక్స్ చేసింది కాబట్టి అక్కడ గెలవగలిగింది. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కొందరు నేతలే అంతర్గతంగా వైఎస్ వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేయించారు. ఈ విషయాన్నే అప్పట్లో వివేకానందరెడ్డి కూడా ఆరోపించారు. పార్టీలో కొంత మంది నమ్మకంగా దెబ్బ వేశారు అని బహిరంగంగా చెప్పారు.

గెలుపుపై అనుమానాలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే విభేధాలు (గ్యాప్స్) మొదలైయ్యాయి. ఈ విషయం కడప జిల్లాలోని అన్ని రాజకీయ పక్షాలకు తెలుసు. ఆ వివాదం ఎంపీ సీటు వరకూ వచ్చిందని వార్తలు వచ్చాయి. రీసెంట్ గా వైఎస్ షర్మిల కూడా ఇదే విషయాన్ని చెప్పారని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే..? బీటెక్ రవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకుండా గెలిచారు. వైఎస్ ఫ్యామిలీలోని కొందరు ఆయన గెలుపునకు సహకరించారు అంటే గతంలో వారితో స్నేహం ఉన్నట్లే కదా..!రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే నానుడి ఉంది. సో.. బయటకు శత్రుత్వం ఉన్నా లోలోపల కొన్ని ఒప్పందాలు ఉండవచ్చు. అందుకే కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఇదే చర్చనీయాంశంగా మారుతోంది.

 

వాళ్లపై దూకుడుగా వెళ్లడం లేదనే..

దీని కారణంగా కొంత మంది టీడీపీ నేతలు ఇన్ చార్జి విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన బలం లేని చోట ఎమ్మెల్సీగా గెలిచారు అంటే కొన్ని వైసీపీ ఓట్లు ఆయనకు పడ్డాయి అంటే వాళ్లలో ఎవరో కొందరు సహకరించారు అంటే వైసీపీతో స్నేహం ఉన్నట్లే కదా..! అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఆయన పక్కా తెలుగుదేశం వాదే అని చెబుతున్నప్పటికీ ఆయన గెలుపును మాత్రం అనుమానిస్తున్నారు. ఈ పరిణామాల వల్ల ఇన్ చార్జి మార్పునకు అవకాశం ఉంటుందేమో అన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు వైసీపీ నేతలు గెలుపునకు సహకరించినందున బీటెక్ రవి వాళ్లపై దూకుడుగా వెళ్లలేకపోతున్నారు. వాళ్లను విమర్శించలేకపోతున్నారు అన్న అపవాదు అయితే ఉంది. అయితే అప్పట్లో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీయే గెలిచింది. వాస్తవానికి నంద్యాలలో కూడా వైసీపీదే బలం. కడప (పులివెందుల ఎమ్మెల్సీ), నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చేసిందే ఇప్పుడు వైసీపీనే చేస్తొందని టాక్.

Chandrababu: బాబుకు చేరిన ప్రముఖ పత్రిక సర్వే..! టీడీపీకి ఎన్ని సీట్లు..? లిస్ట్..!

TDP YCP; Did Chandrababu win his Strategy


Share

Related posts

నర్సాపురం ఎంపి అభ్యర్థిగా నాగబాబు

sarath

అమరావతి గొడవ కీ .. బాలకృష్ణ క్లోజ్ బంధువు కీ ఏం సంబంధం ? 

sekhar

YS Sharmila షర్మిల పార్టీ ముహూర్తం ఖరారు..! ఇద్దరు సీఎంల మద్దతుతో సూపర్ ప్లాన్ తో సిద్ధం..!!

Srinivas Manem