NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని అన‌ప‌ర్తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీటు వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగానే కాకుండా.. వ్య‌క్తిగ‌తంగానూ.. దేశ‌భ‌క్తి కోణంలోనూ… కాక‌రేపుతోంది. ఎందుకంటే.. ఇక్క‌డ జ‌రుగుతున్న రాజ‌కీయం అలానే ఉంది. అస‌లు ఏం జ‌రిగిందంటే.. బీజేపీతో జ‌ట్టు క‌ట్టిన త‌ర్వాత‌.. టీడీపీకి కంచుకోట వంటి అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆ పార్టీకి ఇచ్చేశారు. ఎలాగూ గెలిచేసీటు కాబ‌ట్టి.. ఏమాత్రం సంకోచించ‌కుండానే బీజేపీ తీసేసుకుంది.

అంతేకాదు.. బీజేపీ ఆ వెంట‌నే.. అన‌ప‌ర్తి అభ్య‌ర్థిగా క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన శివ‌రామ‌కృష్ణ రా జును ప్ర‌క‌టించారు. ఈయ‌న తొలిసారి రాజ‌కీయ అరంగేట్రం చేశారు. అయితే.. ఇదేదో సామాన్యమేలే అనుకుంటే పొర‌పాటే.. ఈయ‌న‌ను అడ్డు పెట్టుకుని బీజేపీ.. దేశ‌భ‌క్తి అంశాన్ని ప్ర‌చారంలోకి తీసుకువ చ్చింది. త‌మ‌కు ఉన్న దేశ‌భ‌క్తికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని.. బీజేపీ రాష్ట్ర నాయ‌కులు అనేక ప్ర‌సంగాల్లో చెప్పుకొ చ్చారు. దీనికి కార‌ణం.. సుమారు 15 సంవ‌త్స‌రాల పాటు.. శివ‌రామ‌కృష్ణరాజు.. భార‌త సైన్యంలో జ‌వానుగా ప‌నిచేసి రిటైర్ కావ‌డ‌మే.

ప్ర‌స్తుతం ఆయ‌న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈయ‌న‌ను పిలిచి టికెట్ ఇచ్చిన‌.. బీజేపీ నేత పురందే శ్వ‌రి.. వైసీపీకి కూడా స‌వాల్ రువ్వారు. దేశ‌భ‌క్తికి తాము ప్ర‌తీక‌ల‌మ‌న్న ఆమె.. వైసీపీ ఇలాంటి వారికి ఎవ‌రి కైనా ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు. క‌ట్ చేస్తే.. ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా తిర‌క్కుండానే.. ఇక్క‌డ స‌మీక ర‌ణ‌లు మారాయి. అన‌ప‌ర్తి టికెట్‌ను ఆశించిన టీడీపీ నేత న‌ల్లమిల్లి రామ‌కృష్నారెడ్డి నిర‌సన వ్య‌క్తం చేశారు. టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ఒంట‌రిగా అయినా పోటీ త‌థ్య‌మ‌ని హెచ్చ‌రించారు. దీంతో తెరువెనుక ఏం జ‌రిగిందో ఏమో.. అన‌ప‌ర్తిలో సీటు మార్చేసే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

అయితే .. ఇక్క‌డ కూడా ట్విస్టు ఉంది. న‌ల్ల‌మిల్లిని నేరుగా టీడీపీ టికెట్‌పై పోటీకి పెట్ట‌కుండా.. ఇప్ప‌టికే టికెట్ ప్ర‌క‌టించిన బీజేపీనేత‌.. మాజీ సైనికుడు రాజును ప‌క్క‌న పెట్టేసి.. న‌ల్ల‌మిల్లికి బీజేపీ కండువా క‌ప్పేసేందు కు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనికి రంగం కూడా రెడీ అయింది. ఈ రోజో రేపో న‌ల్ల‌మిల్లి.. టీడీపీని వీడి బీజేపీలో చేరిపోనున్నారు. దీనికి బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం (పురందేశ్వ‌రి ఒక్క‌రే) ఓకే చెప్పింది. దీనికి అనుకూలంగా ఆమె నివేదిక‌లు కూడా రెడీ చేసుకున్నారు. దీంతో ఏపీ బీజేపీని పురందేశ్వ‌రి త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం గోదావ‌రిలో ముంచేస్తున్నార‌ని కొంద‌రు బీజేపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక సైనికుడినైన త‌నను ముందు నిల‌బెట్టి… ఇప్పుడు అవ‌మానిస్తారా? ఇదేనా దేశ‌భ‌క్తి అంటూ.. రాజు ఫైర‌వుతున్నారు. దీనిని అధిష్టానం వ‌ద్దే తేల్చుకుంటాన‌ని చెబుతున్నారు.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?