అత్యాచారం ఆరోపణలపై విశాఖ జ్ఞానంద ఆశ్రమ నిర్వహకుడు పూర్ణానంద స్వామిజీ అరెస్టు అయ్యారు. స్వామీజీ తనపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నారని రాజమండ్రికి చెందిన అనాధ బాలిక (15) ఫిర్యాదుపై గత అర్ధరాత్రి స్వామిజీని పోలీసులు అరెస్టు చేశారు. స్వామీజీపై ఫోక్సో యాక్ట్ కింద దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంతో స్వామిజీ నిర్వహిస్తున్న జ్ఞానంద రామానంద ఆశ్రమం వివాదంలో చిక్కుకుంది. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో బాలికను చేరదీసిన బంధువులు అయిదవ తరగతి వరకూ చదవించి రెండేళ్ల క్రితం విశాఖ కొత్త వెంకోజీపాలెం లో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించారు.

అక్కడ స్వామిజీ ఆమెతో అవులకు మేత వేయించడం, పేడ తీయించడం వంటి పనులు చేయించే వారు. తనపై రెండేళ్ల నుండి పూర్ణానంద స్వామి లైంగిక దాడులకు పాల్పడుతున్నాడనీ, ఓ పని మనిషి సహకారంతో ఆ ఆశ్రమం నుండి బయటపడ్డానని బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. దిశ పోలీసులు రంగంలోకి దిగి స్వామిజీని అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమంలో రాత్రి తనిఖీలు నిర్వహించారు. తమకు కొన్ని ప్రాధమిక ఆధారాలు లభించాయని దిశ ఏసీపీ వివేకానంద తెలిపారు. పూర్ణానంద స్వామిని దిశ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అయితే.. పూర్ణానదం స్వామి తన పై ఆరోపణలను ఖండించారు. తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తమ ఆశ్రమ భూములను కొట్టేయాలని కొందరు చూస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఈ కుట్ర జరిగిందన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. సింహాచలం దేవస్థానం తప్పు చేస్తొందని ఫిర్యాదు చేస్తే దాన్ని ఎవరూ పట్టించుకోలేదనీ, కానీ నాపై, ఆశ్రమంపై కక్షకట్టి ఇలా చేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు ఆశ్రమంలో 1500 మంది పిల్లలు ఉండే వారు కానీ ఇప్పుడు కేవలం 12 మంది మత్రమే ఉంటున్నారు. ఆధ్యాత్మిక సేవ చేస్తుంటే అడ్డుకుంటున్నారనీ, ఆ బాలికను మచ్చిక చేసుకుని ఈ ఫిర్యాదు చేయించారని ఆయన అంటున్నారు.
బాధిత బాలిక రాజమండ్రికి సమీపంలోని గండేపల్లికి చెందినదిగా గుర్తించారు. ఒక రైలు ఎక్కి వెళ్తుండగా, ఓ కుటుంబం ఆమెను ఆదుకుని పూర్ణానంద స్వామిజీ లీలలు బయటపడేలా చేశారు. పోలీసుల విచారణలో ఆ ఆశ్రమంలో సేవల పేరుతో బాలిక చేత వెట్టి చారికీ చేయిస్తున్నట్లు తేలింది.
TDP Internal: టీడీపీలో చంద్రబాబుకు తాజా తలనొప్పులు.. పలువురు సీనియర్ నేతలు రివర్స్..?